Site icon NTV Telugu

Madhya Pradesh: యాక్సిడెంట్ బాధితుడిని బుల్డోజర్‌లో ఆసుపత్రికి తరలింపు.. వీడియో వైరల్

Madhya Pradesh

Madhya Pradesh

patient was taken to the hospital in a bulldozer In madhya pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వైద్యారోగ్య పరిస్థితి ఏ విధంగా ఉండో నిరూపించే మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ రాష్ట్రంలో గతంలో అంబులెన్సులు లేకపోవడం, చికిత్స పొందుతూ..చనిపోయిన వారికి అంబులెన్స్ సౌకర్యాన్ని కూడా కల్పించకపోవడంతో బైకుపై మృతదేహాలను సొంతూరుకు తరలించిన ఘటనలు చూశాం. గతంలో మధ్యప్రదేశ్ మొరేనా జిల్లాలో ఓ ఎనిమిదేళ్ల పిల్లవాడు.. తన రెండేళ్ల తమ్ముడి శవాన్ని ఒడిలో పెట్టుకుని కూర్చున్న ఫోటోలు దేశవ్యాప్తంగా మారాయి.

తాజాగా మరోసారి ఆ రాష్ట్రంలో వైద్య సౌకర్యాలు ఎలా తెలిపే సంఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని బుల్డోజర్ లో ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన మధ్యప్రదేవ్ కట్నీలో చోటు చేసుకుంది. యాక్సిడెంట్ కావడంతో తీవ్ర గాయాలైన ఓ వ్యక్తిని జేసీబీ బకెట్ లో పెట్టుకుని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అంబులెన్స్ కు ఫోన్ చేసినా.. సకాలంలో అధికారులు స్పందించలేదు. అరగంట వేచి చూసినా.. అంబులెన్స్ రాకపోవడంతో, బాధితుడి రక్తం పోతుండటంతో చేసేదేం లేక స్థానికంగా ఉన్న బుల్డోజర్ ముందు బకెట్ లో బాధితుడిని పడుకోపెట్టుకని ఆస్పత్రికి తీసుకువచ్చారు. రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో మహేష్ బర్మన్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.

READ ALSO: Icrisat: ఇండియాలోనే తొలిసారి.. పల్లీలను ఎక్స్‌రే తీసి క్వాలిటీ అందిస్తామంటున్న ఇక్రిశాట్

అరగంట తర్వాత కూడా అంబులెన్స్ రాకపోవడంతో.. పుష్పేంద్ర విశ్వకర్మ అనే వ్యక్తి జేసీబీ సహయంతో బాధితుడని ఆస్పత్రిలో చేర్పించేందుకు ముందుకు వచ్చాడు. ప్రస్తుతం యాక్సిడెంట్ లో గాయపడిన వ్యక్తిని జేసీబీలో తరలిస్తున్న వీడియో వైరల్ గా మారింది. గతంలో కూడా మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి సంఘటలు అనేకం జరిగాయి. తలకు గాయంతో వచ్చిన ఓ వ్యక్తికి కండోమ్ రేపన్ తో డ్రెస్సింగ్ చేశారు. అంతకుముందు అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు సకాలంలో అంబులెన్స్ రాకపోవడంతో తోపుడు బండిలో ఆస్పత్రికి తరలించిన ఘటనలు చూశాం. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్రంలో వైద్యారోగ్య సౌకర్యాలకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

Exit mobile version