Madhya Pradesh -man stabs young woman for rejecting marriage proposal: జార్ఖండ్ దుమ్కా తరహాలోనే మధ్యప్రదేశ్‌లో మరో ఘటన చోటు చేసుకుంది. ఇప్పటికే జార్ఖండ్ దుమ్కా మర్డర్ కేసుల దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తాజాగా మరోసారి ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిన కారణంగా ఓ బాలికను కత్తిలో పొడిచాడు ఓ వ్యక్తి. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా జిల్లాలోని బంగర్ఢ గ్రామంలో చోటు చేసుకుంది. నిందితుడు బబ్లూ, పెళ్లి చేసుకోవాలని 20 ఏళ్ల యువతి వెంట పడుతున్నాడు. అయితే బబ్లూ పెళ్లి ప్రతిపాదనను సదరు యువతి తిరస్కరించింది. దీంతో ఇంట్లో ఉన్న యువతిని కత్తితో పలుమార్లు పొడిచాడు నిందితుడు.
ప్రస్తుతం ఆసుపత్రిలో బాధితురాలు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎస్పీ వివేక్ సింగ్ తెలిపారు. పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతోనే బబ్లూ తన అక్కను చంపాలని చూడాడని బాధితురాలి చెల్లి వెల్లడించింది. అమ్మనాన్నలు ఊరు వెళ్లడంతో తాను, తన అక్క ఇంట్లో ఒంటరిగా ఉన్నామని.. ఆ సమయంలో బబ్లూ ఇంటిలోకి వచ్చి గదిలో ఉన్న అక్కను కత్తితో పొడిచాడని తెలిపింది. బబ్లూ పక్క గ్రామంలో వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం నిందితుడు బబ్లూ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Read Also: MP Parvesh Verma: మనీష్ సిసోడియాకు నార్కో టెస్ట్ నిర్వహించాలి
ఇటీవల జార్ఖండ్ దుమ్కాలో జరిగిన యువతి హత్య సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తన ప్రతిపాదనను తిరస్కరిస్తున్న కారణంగా పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేశాడు ఓ వ్యక్తి. 12 వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల అంకిత నిద్రిస్తున్న సమయంలో కిటీకీ నుంచి పెట్రోల్ పోసి నిప్పంటించాడు షారుక్ అనే వ్యక్తి. గత కొంత కాలంగా బాధిత బాలిక వెంటపడుతున్నాడు షారుఖ్ తన ప్రేమను అంగీకరించకపోయేసరికి ఆమెను హత్య చేయాలని భావించిన షారుఖ్ పెట్రోల్ పోసి తగలపెట్టాడు. ఈ ఘటన ఆగస్టు 23న జరిగింది. చికిత్స పొందుతూ..ఆదివారం మరణించింది.
