Madhya Pradesh: ఓ కొడుకు తల్లిపై ప్రేమను చాటుకున్నాడు. ఏకంగా తన చర్మంతో తల్లికి చెప్పులు కుట్టించాడు. రామాయణ బోధనల స్పూర్తితో ఆయన ఈ పనిచేశాడు. తన శరీరంలోని చర్మం కొంత భాగాన్ని ఉపయోగించి తల్లికి ఈ బహుమతిని అందించాడు. అతని త్యాగం తల్లితో సహా అందర్ని కంటతడి పెట్టించింది. ఒకప్పుడు రౌడీ షీటర్‌గా ఉన్న వ్యక్తి, రామాయణంలో స్పూర్తిపొంది మంచి మార్గాన్ని ఎంచుకున్నారు.
రౌనక్ గుర్జార్ ఒకప్పుడు పోలీసుల తూటాలకు గాయపడ్డాడు. ప్రస్తుతం తన తొడ భాగంలోని కొంత చర్మాన్ని ఉపయోగించ పాదరక్షలను తయారు చేసి తల్లికి బహుమతిగా అందించాడు. శ్రీరాముడు తన తల్లి పట్ల చూపిన ప్రేమకు, భక్తితో స్పూర్తి పొందినట్లు ఆయన తెలిపారు. నేను క్రమం తప్పకుండా రామాయణాన్ని పారాయణం చేస్తానని, రాముడి పాత్ర నన్ను ఎంతో ప్రభావితం చేసిందని రౌనక్ వెల్లడించారు.
Read Also: Muthol Ex MLA: బీఆర్ఎస్కు మరో షాక్.. కాంగ్రెస్లోకి ముథోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి
తన చర్మంతో చెప్పులు తయారు చేసినా కూడా తల్లి సేవలకు సరిపోదని రాముడు స్వయంగా చెప్పాడు. ఈ మాటలు తనలో ప్రతిధ్వనించాయని, నా చర్మంతో పాదరక్షలు తయారు చేసి వాటిని మా అమ్మకు బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. ఎవరికి చెప్పకుండా, తన కుటుంబానికి సమాచారం ఇవ్వకుండా ఆస్పత్రిలో శస్త్రచికిత్స ద్వారా చర్మాన్ని తొలగించుకుని, దానిని పాదరక్షలు తయారు చేసే వ్యక్తి వద్దకు తీసుకువెళ్లి చెప్పులు తయారు చేయించాడు. మార్చి 14, 21 మధ్య తన ఇంటి దగ్గర ఏర్పాటు చేసిన భగవత్ కథలో రౌనక్ తన తల్లికి చెప్పులు సమర్పించారు. వ్యాసపీఠంపై కూర్చున్న గురు జితేంద్ర మహారాజ్‌తో రౌనక్ త్యాగానికి తల్లితో సహా అక్కడ ఉన్నవాళ్లంతా ఈ ఘటనకు చలించిపోయారు.
