Site icon NTV Telugu

Diamond: కార్మికుడ్ని వరించిన అదృష్టం.. రూ.80లక్షల విలువైన వజ్రం లభ్యం

Diamond

Diamond

చాలా మంది జీవితం బాగుపడాలంటే అదృష్టం కలిసి రావాలంటారు. ఇది సరదాగా అంటారో లేదంటే నిజంగానే అంటారో తెలియదు గానీ.. ఓ కార్మికుడి పట్ల ఇది అక్షరాల నిజమైంది. మధ్యప్రదేశ్‌కు చెందిన కార్మికుడికి రూ.80 లక్షల విలువైన వజ్రం దొరికింది. దీంతో అతడి కుటుంబ సభ్యులంతా సంతోషంతో ఎగిరి గంతులు వేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Apple Foldable Phones: ఆపిల్ ఫోల్డబుల్ ఫోన్స్ వచ్చేది అప్పుడేనా.?

మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లా వజ్రాలకు పేరుగాంచిన ప్రాంతం. అయితే బుధారం రాజుగౌడ్ అనే వ్యక్తికి 19.22 క్యారెట్ల డైమండ్ దొరికింది. ఇది ప్రభుత్వ వేలంలో రూ.80 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ధర పలుకుతుందని అధికారులు తెలిపారు. గత పదేళ్లుగా వర్షాకాలంలో మట్టిని తవ్వి జల్లెడ పడుతుంటానని.. ఈరోజు ఇంతటి ఆదాయం వస్తుందని తాను ఊహించలేదని రాజుగౌడ్ పేర్కొన్నారు. ఈ డైమండ్‌తో తన ఆర్థిక కష్టాలు తీరిపోతాయని.. పిల్లల చదువులు కూడా ముందుకు సాగిపోతాయని ఆనందం వ్యక్తం చేశాడు. కృష్ణకల్యాణ్‌పుర్‌లో లీజుకు తీసుకున్న గనిలో ఈ విలువైన వజ్రం దొరకడం ఎంతో ఆనందంగా ఉందని, వెంటనే దీన్ని ప్రభుత్వ అధికారుల దగ్గర జమ చేసినట్లు రాజు గౌడ్ తెలిపాడు. ఈ విలువైన వజ్రాన్ని తదుపరి వేలంలో విక్రయానికి ఉంచనున్నట్లు పన్నా డైమండ్ కార్యాలయ అధికారి అనుపమ్ సింగ్ వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Ballistic Missile Defence System: ఫేస్ 2 బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ పరీక్ష విజయవంతం..

Exit mobile version