Madhya Pradesh jabalpur Hospital Fire accident: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. జబల్‌పూర్ లోని ఓ ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు పేషెంట్లను, సిబ్బందిని రెస్క్యూ చేసేందుకు ఆపరేషన్ ప్రారంభించారు. జబల్‌పూర్ దామోహ్ నాక్ ప్రాంతంలోని న్యూ లైప్ మల్టీ స్పెషాటిటీ ఆస్పత్రిలో ఈ రోజు ( సోమవారం) మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఐదుగురు రోగులతో పాటు ముగ్గురు హస్పిటల్ సిబ్బంది మరణించారు. మరో 12 మంది దాకా గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Read Also: Viral News: మోడీజీ.. మీ వల్లే మా అమ్మ నన్ను కొట్టింది. ఒకటో తరగతి చిన్నారి లేఖ వైరల్.
ఆస్పత్రిలో షార్ట్ సర్క్యూట్ ద్వారానే అగ్నిప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ భారీ అగ్ని ప్రమాదం నుంచి ఆస్పత్రిలో చిక్కుకున్న వారందరిని రక్షించినట్లు జబల్‌పూర్ ఎస్పీ సిద్ధార్థ్ బహగుణ తెలిపారు. ఆస్పత్రిలో అందరిని రెస్క్యూ చేసినట్లు.. ఇంకా ఎవరు లోపల లేరని ఎన్డీఆర్ఎఫ్ అధికారారి సంజీవ్ కుమార్ గుప్తా వెల్లడించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాద ఘటన, సహాయక చర్యలను పర్యవేక్షించాలని జబల్‌పూర్ కలెక్టర్, ఇతర అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
