Site icon NTV Telugu

Madhya Pradesh: ప్రతిభకు “చూపు లేకపోవడం” అడ్డంకి కాదని నిరూపించాడు..భారీ ప్యాకేజీతో మైక్రోసాఫ్ట్ జాబ్

Microsoft

Microsoft

Microsoft offered a job to a visually impaired person with a huge package: ప్రతిభకు ఏ శారీరక లోపం కూడా అడ్డంకి కాదు. చాలా మంది తమ సమస్యలపై పోరాడి జీవితంలో విజయం సాధించారు. ఉన్నత స్థానాలుకు వెళ్లారు. కంటి చూపు లేకపోయినా.. శారీరక వైకల్యం ఉన్నా కూడా జీవితంలో పోరాడి గెలిచారు. తన ప్రతిభకు ఇవేమే అడ్డంకులు కాదని నిరూపించారు. అన్నీ సక్రమంగా ఉన్నా.. పనిచేసేందుకు కొంతమంది బద్ధకిస్తున్న ఈ రోజుల్లో తమ వైకల్యాన్ని అధిగమిస్తూ ఉన్న స్థానాలకు చేరుకుంటున్నారు కొందరు. వారంతా చాలా మందికి స్పూర్తిగా నిలుస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే మధ్యప్రదేశ్ లో జరిగింది.

కంటి చూపు లేని వ్యక్తి రూ. 47 లక్షల వార్షిక ప్యాకేజ్ తో సాఫ్ట్ వేర్ కొలువు సంపాదించారు. మధ్యప్రదేశ్ కు చెందిన 25 ఏళ్ల వ్యక్తి యష్ సోనాకియాకు ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ రూ.47 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం ఇచ్చింది. యష్ సోనాకియా 2021లో తన బీటెక్ ను పూర్తి చేశారు. ఇండోర్ లోని శ్రీ గోవింద్రం సెక్సారియా ఇన్‌గ్రేడ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నుంచి బీటెక్ పట్టాపొందారు. తాజాగా యష్ సోనాకియాకు బంపర్ ఆఫర్ లభించింది. త్వరలోనే బెంగళూర్ లోని మైక్రోసాఫ్ట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా చేరుతా అని వెల్లడించారు సోనాకియా. కోడింగ్ నేర్చుకున్న తరువాత మైక్రోసాఫ్ట్ కు దరఖాస్తు చేసుకున్నానని.. ఆన్ లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ తర్వాత సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పోస్టుకు ఎంపికయ్యానని సోనాకియా వెల్లడించారు.

Read Also: Sai Dharam Tej: నన్ను కాపాడింది అదే.. దాని వల్లే బతికున్నా

సోనాకియా తన ఎనిమిదేళ్ల వయసులో గ్లాకోమాతో కంటి చూపును కోల్పోయారు. యష్ సోనాకియా తండ్రి యశ్‌పాల్ ఇండోర్ లో ఓ క్యాంటీన్ నడుపుతున్నారు. ‘‘ నా కొడుకు ఎనిమిదేళ్లు వచ్చే సరికి పూర్తిగా కంటి చూపు కోల్పోయాడని.. అయితే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కావాలనుకున్నాడని’’ యశ్ పాల్ చెప్పారు. యశ్ పాల్ తన కుమారుడు యష్ సోనాకియాను ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల పాఠశాలలో చేర్పించారు. పట్టుదలతో చదివి మంచి జాబ్ సంపాదించాడు.

Exit mobile version