పంజాబ్‌లోని లూథియానాలో జరిగిన 18వ అంతర్జాతీయ PDFA డైరీ అండ్ అగ్రి ఎక్స్‌పోలో పాడి పశువుల పోటీలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. మోగాలోని ఓంకార్ డైరీ ఫామ్‌కు చెందిన HF జాతి ఆవు 24 గంటల్లో 82 లీటర్ల పాలు ఇచ్చి జాతీయ రికార్డును బద్దలు కొట్టింది. ఆవులు వాటి జాతుల రకాలను బట్టి రోజుకు 5 నుంచి 10 లీటర్ల పాలు ఇస్తుంటాయి. కానీ, లుథియానాలోని 18వ అంతర్జాతీయ పీడీఎఫ్ఏ డైరీ అండ్ అగ్రీ ఎక్స్ పోలో హోల్ స్టేయిన్ ప్రైసియన్ జాతి ఆవు 24 గంటల్లో 82 లీటర్ల పాలు ఉత్పత్తి చేసి ఆశ్చర్యపరిచింది.
Also Read: CM Yogi Adityanath: ఎంతకు తెగించార్రా.. యోగికే “టోపీ” పెడతారా..
మోగాలోని నూర్‌పూర్ హకీమా గ్రామంలోని ఓంకార్ డైరీ ఫామ్‌కు చెందిన హర్‌ప్రీత్ సింగ్ అనే హెచ్‌ఎఫ్ జాతి ఆవు 24 గంటల్లో 82 లీటర్ల పాలు ఇచ్చి జాతీయ రికార్డును కొల్లగొట్టి మొదటి స్థానాన్ని దక్కించుకుందని పిడిఎఫ్‌ఎ ప్రెస్ సెక్రటరీ రేషమ్ సింగ్ భుల్లార్ తెలిపారు. ఇక ఇది తెలిసిన వారు ఇలాంటి ఆవు ఒక్కటి ఉంటే చాలు పాడి రైతులు లాభాలు అందుకోవడం పక్కా అంటున్నారు. కాగా పటియాలాలోని పలియా ఖుర్ద్ గ్రామానికి చెందిన అగర్‌దీప్ సింగ్‌కు చెందిన ఆవు 78.570 లీటర్ల పాలు ఇచ్చి రెండో స్థానంలో నిలిచింది.
Also Read: Lavanya: నన్ను వాళ్లు చంపేస్తారు.. లావణ్య సంచలన వ్యాఖ్యలు..
లుథియానాలోని కులార్ గ్రామానికి చెందిన సంధు డైరీ ఫామ్‌కు చెందిన ఆవు 75.690 లీటర్ల పాలు ఇచ్చి మూడో స్థానంలో నిలిచింది. గతంలో కూడా పలు జాతులకు చెందిన ఆవులు రికార్డ్ స్థాయిలో పాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇది తెలిసిన వారు ఇలాంటి ఆవు ఒక్కటి ఉంటే చాలు పాడి రైతులు లాభాలు అందుకోవడం పక్కా అంటున్నారు. అయితే ఆవుల్లో పాల ఉత్పత్తి బాగా ఉండాలంటే పోషణ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.