Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌కి పూర్తిస్థాయిలో రాష్ట్ర హోదా కల్పించాలని, ఆ రాష్ట్ర కేబినెట్ కేంద్రాన్ని కోరింది. ఈ తీర్మానానికి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆమోదం తెలిపారు. కేంద్ర పాలిత ప్రాంతం నుంచి రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని సీఎం ఒమర్ అబ్దుల్లా మంత్రి వర్గం కేంద్రాన్ని కోరింది. తాజా తీర్మానం జమ్మూ కాశ్మీర్‌కి రాష్ట్ర హోదా గుర్తింపును పునురుద్ధరించే ముఖ్యమైన ముందడుగుగా భావిస్తున్నారు.
ఈ అంశాన్ని ప్రధానితో పాటు కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర హోదా పునరుద్ధరణకు సంబంధించి ప్రధాన మంత్రి, కేంద్రమంత్రులతో సీఎం ఒమర్ అబ్దుల్లా భేటీ అయ్యేందుకు త్వరలోనే ఢిల్లీ రాబోతున్నారని ఒక ప్రభుత్వ అధికారి వెల్లడించారు.
Read Also: Rahul Gandhi: లారెన్స్ బిష్ణోయ్ నెక్ట్స్ టార్గెట్ రాహుల్ గాంధీ.. ఒడియా నటుడి వివాదాస్పద పోస్ట్..
నవంబర్ 04న శ్రీనగర్‌లో కొత్తగా ఎన్నికైన శాసనసభ సమావేశం జరగనుంది. సెషన్ ప్రారంభంలో లెఫ్టినెంట్ గవర్నర్ ప్రసంగించనున్నారు. అక్టోబర్ 21న ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకరాం చేయించేందుకు ముబారిక్ గుల్‌ని ప్రొటెం స్పీకర్‌గా నియమించాలని కేబినెట్ సిఫారసు చేసింది. స్పీకర్ ఎన్నిక జరిగే వరకు గుల్ ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తూ ఎల్‌జీ ఉత్తర్వులు జారీ చేశారు.
దశాబ్ధం తర్వాత, ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత తొలిసారిగా ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో 48 స్థానాలను గెలుచుకుంది. బీజేపీ 29 స్థానాలతో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. కాంగ్రెస్ కేవలం 6 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.