LPG Crisis: ఇరాన్ యుద్ధం వల్ల భారత్‌లో వంటగ్యాస్ (LPG) డిమాండ్ తారాస్థాయికి చేరుతోంది. చాలా మంది గ్యాస్ కొరతతో వాటిని బ్లాక్ చేయడం మొదలుపెట్టారు. మరోవైపు, కేంద్రం గృహవినియోగదారులపై ఎలాంటి ప్రభావం పడకుండా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఎల్పీజీ ఉత్పత్తిని పెంచినట్లు కేంద్రం ప్రకటించింది. మరోవైపు, హోటళ్లు-రెస్టారెంట్ల వంటి బిజినెస్‌లపై వంట గ్యాస్ ఎఫెక్ట్ పడుతోంది. హైదరాబాద్‌తో పాటు చాలా నగరాల్లో కమర్షియల్ సిలిండర్లకు డిమాండ్ పెరిగింది. దీంతో గ్యాస్ ఏజెన్సీలు డబుల్ ధరలకు సిలిండర్లను విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also: Hyderabad: కష్టపడి సీఐని చేస్తే.. చావునే బహుమతిగా ఇచ్చింది! భార్య వేధింపులకు భర్త బలి..
ఇదిలా ఉంటే, మరోసారి వంట గ్యాస్ బుకింగ్ పిరియడ్ పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. మరోసారి బుకింగ్ కాలాన్ని పెంచింది. రెండు సిలిండర్ల బుకింగ్ గ్యాప్ 25 రోజులు ఉండగా, ఇప్పుడు దీనిని 45 రోజులకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుందని వెల్లడించింది. పట్టణాల్లో, నగరాల్లో 25 రోజుల నిబంధన కొనసాగనుంది.
