NTV Telugu Site icon

లాక్‌డౌన్  ముగింపుకు మూడు అంశాల ప్ర‌ణాళిక‌…

క‌రోనా మ‌హ‌మ్మారి కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌వుతున్న సంగతి తెలిసిందే.  దీంతో అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఆంక్ష‌లు అమ‌లుచేస్తున్నారు.  లాక్‌డౌన్ అమ‌లు చేస్తున్న రాష్ట్రాల్లో కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.  కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్న స‌మ‌యంలో లాక్‌డౌన్ ను ఎత్తివేయాల‌ని రాష్ట్రాలు చూస్తున్నాయి.  క‌రోనా లాక్‌డౌన్‌ ఎత్తివేత‌పై ఐసీఎంఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.  దీనికోసం మూడు అంశాల ప్ర‌ణాళిక‌ను వెల్ల‌డించింది.  త‌క్కువ పాజిటివిటి రేటు, అత్య‌ధిక మందికి టీకాలు, కోవిడ్ నిబంధ‌న‌ల‌తో కూడిన ప్ర‌వ‌ర్త‌న‌ల వంటి అంశాల‌ను రాష్ట్రాలు ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని లాక్‌డౌన్‌ల‌పై నిర్ణ‌యం తీసుకోవాల‌ని ఐసీఎంఆర్ పేర్కొన్నారు.  కోవిడ్ ముప్పు అధికంగా ఉన్న వ‌ర్గాల‌కు 70శాతానికి పైగా వ్యాక్సిన్ టీకాలు వేసి సామాజిక బాధ్య‌త‌గా ప్ర‌జ‌లు కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తుంటే ఆ ప్రాంతాల్లో లాక్‌డౌన్ ను ఎత్తివేయ‌వ‌చ్చ‌ని ఐసీఎంఆర్ ఛీఫ్ బ‌ల‌రాం భార్గ‌వ పేర్కొన్నారు.