NTV Telugu Site icon

INDIA bloc: ఢిల్లీలో ఒకటి మీకు, గుజరాత్‌లో 8 మాకు.. ఆప్-కాంగ్రెస్ మధ్య సీట్ల పంచాయతీ..

India Bloc

India Bloc

INDIA bloc: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్-ఆప్ మధ్య పొత్తుల పంచాయతీ కొలిక్కి రావడం లేదు. సీట్ల సర్దుబాటు విషయంలో రెండు పార్టీల మధ్య వ్యవహారం కొలిక్కి రావడం లేదు. ఇప్పటికే ప్రతిపక్ష ఇండియా కూటమిలో విబేధాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఇటీవల బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ, కాంగ్రెస్ పార్టీకి సీట్లు ఇవ్వమని స్పష్టంగా చెప్పింది. మరోవైపు ఆప్ కూడా అదే దారిలో వెళ్తోంది.

Read Also: Sandeshkhali: మహిళలపై టీఎంసీ నేత అఘాయిత్యాలతో అట్టుడుకుతున్న “సందేశ్‌ఖాలీ”..

ఇదిలా ఉంటే, పొత్తుల విషయంలో తాజాగా కాంగ్రెస్ పార్టీకి ఆప్ ఒక ప్రతిపాదన పెట్టింది. ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్ పార్టీకి ఒక లోక్‌సభ స్థానం ఇస్తామని, బదులుగా గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్, తమకు 8 ఎంపీ సీట్లను ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఆప్ రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్ చెప్పారు. సీట్ల పంపకాన్ని త్వరగా ముగించాలని ఇండియా కూటమిని ఆప్ కోరింది. ఇదిలా ఉంటే లోక్‌సభ ఎన్నిలక కోసం పలు స్థానాల కోసం ఆప్ తమ అభ్యర్థుల్ని ప్రకటిస్తోంది. అస్సాంలో ఇప్పటికే మూడు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా.. గుజరాత్‌లో రెండు, గోవాలో ఒక ఎంపీ స్థానానికి అభ్యర్థులను ప్రకటించింది.

ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) సమావేశం తర్వాత, ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్ మాట్లాడారు. దక్షిణ గోవా ఎంసీ స్థానం నుంచి వెంజీ విగాస్ పోటీ చేస్తారని, చైతర్ వాసవ, ఉమేష్ భాయ్ మక్వానా గుజరాత్‌లోని భరూచ్, భావ్‌నగర్ స్థానాల నుంచి పోటీ చేస్తారని తెలిపారు. గుజరాత్ లోని 26 స్థానాల్లో ఆప్ 8 లోక్‌సభ సీట్లను డిమాండ్ చేసిందని, ఢిల్లీలో మేము 6 సీట్లలో పోటీ చేయాలని అనుకుంటున్నట్లు అతను వెల్లడించారు.