NTV Telugu Site icon

Lok Sabha Elections 2024: 97 కోట్ల ఓటర్లు.. 10.5 లక్షల పోలింగ్ స్టేషన్లు..

Lok Sabha Elections 2024

Lok Sabha Elections 2024

Lok Sabha Elections 2024: సార్వత్రిక ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల సంఘం తేదీలను ప్రకటిస్తోంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల తేదీని విడుదల చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఓటేయడానికి మొత్తం 96.8 కోట్ల మంది నమోదిత ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. ఇందులో ఇందులో ఇటీవలే 18 ఏళ్లు నిండిన 1.8 కోట్ల మంది ఉన్నారు. వీరంతా తొలిసారి ఓటేసేందుకు అర్హత సాధించారు. భారతదేశంలో 12 రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. 88.4 లక్షల మంది వికలాంగులు, 48,000 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు.

Read Also: India At UN: అయోధ్య, సీఏఏపై పాకిస్తాన్ కామెంట్స్.. భారత్ ఏం చెప్పిందంటే..

ఎన్నికల నిర్వహణ కోసం 10.5 లక్షల పోటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ బూత్‌లలో 1.5 కోట్ల మంది పోలింగ్ అధికారుల్ని నియమించనున్నారు. ఎన్నికల్లో 55 లక్షల ఈవీఎంలను వినియోగించనున్నారు. ప్రస్తుతం లోక్ సభ పదవీ కాలం జూన్ 16తో ముగుస్తుంది. దేశంలోని 543 లోక్‌సభ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా అసెంబ్లీకు ఎన్నికలు జరగనున్నాయి.