NTV Telugu Site icon

Lok Sabha Elections 2024: ఐదో విడతలో పోటీలో ఉన్న ప్రముఖులు వీరే.. రాయ్‌బరేలీ, అమేథీపై అందరి దృష్టి

5th Phase

5th Phase

Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ నెల 20న ఐదో విడత ఎన్నికలు జరగబోతున్నాయి. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ముఖ్యంగా అత్యంత కీలమైన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని 14 ఎంపీ స్థానాలు ఈ విడతలో ఉన్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఎంతో చర్చనీయాంశం అయిన రాయ్‌బరేలీ, అమేథీకి కూడా ఈ దశలోనే పోలింగ్‌కి వెళ్తున్నాయి. మొత్తం 695 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ప్రజలు తేల్చబోతున్నారు.

రాయ్ బరేలీ నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పోటీ చేస్తుండగా, లక్నో నుంచి మూడో సారి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పోటీ చేస్తున్నారు. అమేథీ నుంచి మరో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ పోటీలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో స్మృతీ ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ పరాజయాన్ని చవిచూశారు. అయితే, ఈ సారి మాత్రం కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ స్థానం నుంచి పలు పర్యాయాలుగా ఎంపీగా ఉన్న సోనియాగాంధీ, రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్లడంతో రాహుల్ గాంధీ పోటీలో నిల్చున్నారు.

Read Also: Prasanna Vadanam: ఓటీటీలోకి థ్రిల్లర్ డ్రామా.. ఆరోజు నుంచే స్ట్రీమింగ్!!

జమ్మూ కాశ్మీర్, లడఖ్‌తో పాటు ఉత్తర్ ప్రదేశ్‌లో 14 స్థానాలు, మహారాష్ట్రలో 13, పశ్చిమ బెంగాల్‌లో 07, ఒడిశాలో 05, బీహార్‌లో 05, జార్ఖండ్‌లో 03 ఎంపీ స్థానాలకు ఐదో దశలో ఎన్నికలను నిర్వహించనున్నారు.

పోటీలో ఉన్న ప్రముఖులు వీరే..

ఉత్తర ప్రదేశ్

అమేథీ: స్మృతి ఇరానీ (బిజెపి) మరియు కిషోరి లాల్ శర్మ (కాంగ్రెస్).
రాయ్‌బరేలీ: రాహుల్ గాంధీ (కాంగ్రెస్)
లక్నో: రాజ్‌నాథ్ సింగ్ (బీజేపీ)
కైసర్‌గంజ్: కరణ్ భూషణ్ సింగ్ (బీజేపీ)

బీహార్

హాజీపూర్: చిరాగ్ పాశ్వాన్ (లోక్ జనశక్తి పార్టీ- రాంవిలాస్)
శరణ్: రోహిణి ఆచార్య (RJD) మరియు రాజీవ్ ప్రతాప్ రూడీ (BJP).
ముజఫర్‌పూర్: రాజ్ భూషణ్ చౌదరి (బీజేపీ)

మహారాష్ట్ర

ముంబై నార్త్: పీయూష్ గోయల్ (బీజేపీ)
ముంబై నార్త్-వెస్ట్: రవీంద్ర దత్తారం వైకర్ (శివసేన)
ముంబై సౌత్: అరవింద్ సావంత్
ముంబై ఉత్తర-మధ్య: ఉజ్వల్ నికమ్ (బిజెపి) మరియు వర్ష గైక్వాడ్ (కాంగ్రెస్)
సంక్షేమం: డాక్టర్ శ్రీకాంత్ షిండే (శివసేన)

జమ్మూ కాశ్మీర్

బారాముల్లా: ఒమర్ అబ్దుల్లా (JK నేషనల్ కాన్ఫరెన్స్)

జార్ఖండ్

చత్ర: కృష్ణ నంద్ త్రిపాఠి (కాంగ్రెస్)