కరోనా ఫస్ట్ వేవ్ అయినా.. సెకండ్ వేవ్ అయినా.. మహారాష్ట్రలో సృష్టించిన విలయం మామూలుది కాదు.. ఇప్పుడిప్పుడే కరోనా సెకండ్ వేవ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.. ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది లేదు.. కానీ, ప్రజలు మాత్రం కోవిడ్ నిబంధనలు గాలి కొదిలి తిరిగేస్తున్నారు.. అయితే, ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించకపోతే మహారాష్ట్రలో మళ్లీ లాక్‌డౌన్ తప్పదని హెచ్చరించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే.. కరోనా మహమ్మారితో పోరాటం కూడా స్వాతంత్ర్య పోరాటం లాంటిదేనని వ్యాఖ్యానించిన ఆయన.. ఈ మధ్య కొత్తగా నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య తగ్గడంతో కొవిడ్ ఆంక్షలను ఎత్తివేశామని, ప్రజలు సరిగా నిబంధనలు పాటించకపోతే మహమ్మారి మళ్లీ విజృంభిస్తుందని, అదేగనుక జరిగితే మళ్లీ ఆంక్షలు విధించక తప్పదని తెలిపారు. కాగా, సెకండ్ వేవ్ పూర్తిస్థాయిలో అదుపులోకి రాకముందే.. థర్డ్ వేవ్ హెచ్చరికలు కలవరపెడుతున్న సంగతి తెలిసిందే.
సీఎం వార్నింగ్.. కోవిడ్ నిబంధనలు పాటించకపోతే మళ్లీ లాక్‌డౌన్..
Uddhav Thackeray