SIR Notice: ఎల్కే అద్వానీకి SIR నోటీసులు..
- ఢిల్లీలో SIR కింద ఎల్కే అద్వానీ నోటీసులు..
- అద్వానీ కుమార్తె, కోడలుకు కూడా..
- 2002 SIR ఓటర్ జాబితాతో పేర్లు మ్యాప్ కాకపోవడమే కారణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల సంఘం ఢిల్లీలో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) సంచలనంగా మారింది. ఓటర్ల వివరాలలో వ్యత్యాసాల నేపథ్యంలో పలువురు ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. తాజాగా మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీకి కూడా SIR నోటీసులు వెళ్లాయి. అద్వానీతో పాటు నోటీసులు అందుకున్న ప్రముఖుల్లో కేంద్రమంత్రి ఎస్ జైశంకర్, మాజీ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదీ, సీబీఐ చీఫ్ ప్రవీణ్ సూద్, ఢిల్లీ మాజీ మంత్రి మనీష్ సిసోడియాలు ఉన్నారు.
ఢిల్లీలో సుమారు 33.13 లక్షల మంది ఓటర్లకు వారి ఎన్యూమరేషన్ ఫారాల్లో నమోదైన వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించిన ఎన్నికల అధికారులు నోటీసులు పంపుతున్నారు. ఇప్పటి వరకు 31.63 లక్షలకు పైగా నోటీసులు అందజేసినట్లు ఢిల్లీ ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఎల్కే అద్వానీ, ఆయన కుమార్తె ప్రతిభ, కోడలు గీతిక పేర్లు 2002లో జరిగిన గత SIR ఓటరు జాబితాతో మ్యాప్ కాలేదు. దీంతో వారికి నోటీసులు జారీ అయ్యాయి. అద్వానీ కుటుంబంలోని నలుగురూ న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లుగా ఉన్నారు. ఎస్ఐఆర్ నోటీసులు వచ్చినంత మాత్రాన ఓటర్ జాబితా నుంచి పేరు తొలిగిపోయినట్లు కాదు, సరైన పత్రాలు సమర్పించి మళ్లీ నమోదు చేసుకోవచ్చు.
Also Read
తాజావార్తలు
-
SIR Notice: ఎల్కే అద్వానీకి SIR నోటీసులు..
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!