Site icon NTV Telugu

LK Advani: ఎయిమ్స్‌లో ఎల్‌కే.అద్వానీకి టెస్టులు పూర్తి.. డిశ్చార్జ్

Lk

Lk

ప్రముఖ బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్‌కె అద్వానీ (96) గత రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. అనంతరం వైద్యుల్ని ఆయన్ను పరీక్షించారు. పలు టెస్టులు కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. టెస్టులు పూర్తైన తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని ఎయిమ్స్ ధృవీకరించింది.

ఇది కూడా చదవండి: Aganampudi Toll Gate: అగనంపూడి టోల్‌గేట్ ఎత్తివేత.. ఇలా స్పందిస్తున్న స్థానికులు..

అద్వానీ వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఇందులో భాగంగానే బుధవారం రాత్రి ఆస్పత్రిలో చేరారు. బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లోని పాత ప్రైవేట్ వార్డులో చేరారు. అద్వానీకి యూరాలజీ, జెరియాట్రిక్ మెడిసిన్‌తో సహా వివిధ స్పెషాలిటీలకు చెందిన వైద్యుల బృందం పరీక్షించారు. టెస్టులు అనంతరం వైద్యం చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక అద్వానీ గురువారం డిశ్చార్జ్ అయినట్లు ఆసుపత్రి అధికారి తెలిపారు.

ఇది కూడా చదవండి: KTR: సింగరేణిని ప్రైవేటీకరించేందుకే కేంద్రం తెలంగాణ బొగ్గు గనులను వేలం వేసింది..

Exit mobile version