NTV Telugu Site icon

Maharshtra: దీపావళి డెకరేషన్‌పై ముస్లిం వ్యక్తుల అభ్యంతరం.. కేసు నమోదు..

Communal Tensions

Communal Tensions

Maharshtra: దీపావళి అలంకరణ విషయంలో ముస్లిం వ్యక్తులు అభ్యంతరం తెలుపుతున్న వీడియో ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైరల్‌గా మారింది. మహారాష్ట్ర నవీ ముంబైలోని పంచానంద్ సొసైటీలోని ఈ ఘటన మతపరమైన ఉద్రిక్తతలకు కారణమైంది. మహిళల్ని దీపాలు వెలిగించవద్దని కొందరు ముస్లింలు హెచ్చరిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై రెండు వర్గాలు కూడా తమకు సపోర్టుగా కామెంట్స్ చేస్తున్నాయి. ఈ వీడియోలో ఇరు పక్షాలు కూడా అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించినట్లు చూడొచ్చు.

Read Also: Vocal for Local: ఈ దీపావళికి చైనాకు రూ.1.25 లక్షల కోట్ల నష్టం..

నివేదిక ప్రకారం.. రెండు వర్గాల మధ్య బక్రీద్ నుంచి వివాదం నడుస్తోంది. జూన్ నెల నుంచి ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. బక్రీద్ సమయంలో ఆ కమ్యూనిటీలోని హిందువులు ముస్లింలు మేకల్ని తమ ఇళ్లకు తీసుకురావడం, వధించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిస్పందనగా, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలనే లక్ష్యంతో ఉమ్మడి ప్రాంతాల్లో ఎలాంటి పండుగ లేదా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించకూడదని సొసైటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముస్లింలు ఇప్పుడు ఈ నిర్ణయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని దీపావళి వేడుకలకు కూడా వర్తించాలని వారు వాదిస్తున్నారు. అయితే, ఈ వివాదంపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు తెలుస్తోంది.

Show comments