Site icon NTV Telugu

Lift Collapse: పెళ్లి వేడుకలో విషాదం

Lift Collapse

Lift Collapse

చెన్నై పెళ్లి వేడుకలో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. లిఫ్ట్ రోప్ తెగిపోయి కిందపడ్డ ఘటనలో ఇంటర్ విద్యార్థి చనిపోయాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పెళ్లిలో భోజనం వడ్డించడానికి నలుగురు యువకులు లిఫ్ట్‌లో వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుడు విఘ్నేష్‌గా గుర్తించారు. తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండిలోని ఓ కళ్యాణ మండపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విఘ్నేష్‌ ఇంటర్‌ చదువుకుంటూ పార్ట్ టైం క్యాటరింగ్ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు… కానీ, ఆ పార్ట్‌ టైం జాబే ఆ యువకుడి ప్రాణాలు తీసింది.. ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇక, ఈఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

Read Also: Ukraine Russia War: వెనక్కి తగ్గిన రష్యా.. మళ్లీ ఆ సిటీ ఉక్రెయిన్‌ వశం..!

Exit mobile version