Wrestlers Protest: బీజేపీ ఎంపీ, డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా రెజ్లర్ల గత కొన్ని రోజులుగా నిరసన తెలుపుతున్నారు. బ్రిష్ భూషన్ ను వెంటనే అరెస్ట్ చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ విషయంపై రెజ్లర్లు శనివారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. అమిత్ షా ఇంటోలో రాత్రి 11 గంటలకు సమావేశం జరిగినట్లు దీనికి సాక్షి మాలిక్, సంగీతా ఫోగట్, సత్యవర్త్ కడియన్, భజరంగ్ పునియా హాజరైనట్లు తెలుస్తోంది.
Read Also: Tata: ఈవీ బ్యాటరీ రంగంలోకి టాటా.. రూ. 13,000 కోట్లతో ప్లాంట్ నిర్మాణం..
మైనర్ తో సహా ఏడుగురు మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బ్రిజ్ భూషన్ పై ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై ఎఫ్ఐఆర్లు కూడా నమోదు అయ్యాయి. ఇదిలా ఉంటే చట్టం తన పనితాను చేసుకుపోతుందని అమిత్ షా రెజ్లర్లకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. బ్రిజ్ భూషన్ పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఇచ్చిన అల్టిమేటం గడువు శనివారంతో ముగిసిన తర్వాత రెజ్లర్లు అమిత్ షాతో సమావేశం అయ్యారని సంబంధిత వర్గాలు తెలిపాయి.