Site icon NTV Telugu

Mohandas Pai: కన్నడ భాషపై కొనసాగుతున్న వివాదం.. ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ సంచలన వ్యాఖ్యలు

Kannada

Kannada

Mohandas Pai: కన్నడ భాషపై కొనసాగుతున్న వివాదంపై ప్రముఖ టెక్‌ ఇన్వెస్టర్‌, ఇన్ఫోసిస్‌ మాజీ సీఎఫ్‌ఓ మోహన్‌దాస్‌ పాయ్‌ స్పందించారు. ఈ సందర్భంగా కర్ణాటకలో పని చేసే ఉద్యోగులు స్థానిక భాష నేర్చుకోవాలని సూచించారు. అలాగే, ప్రజా సంబంధిత వ్యవహారాల్లో దాన్ని ఉపయోగించాలని అన్నారు. కన్నడ భాష నేర్చుకోవడానికి కొందరు అధికారులు నిరాకరించడంతోనే తరుచూ వివాదాలకు కారణమవుతుందని వెల్లడించారు. వీటిని నివారించేందుకు కన్నడను పక్కా నేర్చుకోవాలని అన్నారు. భాషా వివాదం కొనసాగుతున్న వేళ మోహన్ దాస్ పాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది.

Read Also: Ankineedu Prasad: మచిలీపట్నం మాజీ ఎంపీ మృతి.. సీఎం దిగ్భ్రాంతి

కాగా, బెంగళూరుకు రోజు భారీ సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారని మోహన్‌దాస్‌ పాయ్‌ పేర్కొన్నారు. స్థానికంగా కన్నడ మాట్లాడేవారు కేవలం 33 శాతం మంది మాత్రమే ఉంటారు.. బయటి నుంచి వచ్చిన వారు ఇక్కడ స్థిరపడ్డారు.. కానీ, కొందరు అహంకారంతో కొన్ని కన్నడ పదాలు మాట్లాడడానికి కూడా ఒప్పుకోవడం లేదన్నారు. కొన్ని పదాలైనా నేర్చుకొని మాట్లాడుతూ స్థానికులకు గౌరవం ఇవ్వాలని డిమాండ్ మోహన్‌దాస్‌ పాయ్‌ చేశారు.

Read Also: Oasis: ఒయాసిస్ జనని యాత్ర బస్‌ను ఆడోనిలో ప్రారంభించిన ఎమ్మెల్సీ డా. ఎ. మధుసూదన్

అయితే, గత నెలలో బెంగళూరులో ఎస్బీఐ బ్యాంకు ఉద్యోగి వ్యవహారంపై ఈ సందర్భంగా ఇన్ఫోసిస్‌ మాజీ సీఎఫ్‌ఓ మోహన్‌దాస్‌ పాయ్‌ గుర్తు చేశారు. ఒక బ్యాంక్‌ మేనేజర్‌ కస్టమర్‌తో కన్నడ భాషలో మాట్లాడడానికి నిరాకరించడం ప్రజల ఆగ్రహానికి గురి చేసిందని వెల్లడించారు. చివరకు బ్యాంక్‌ నుంచి అధికారిక క్షమాపణ చెప్పాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కస్టమర్‌ సేవల్లో ఉన్నవారు అక్కడి స్థానిక భాష, సంస్కృతిని గౌరవించాలని కోరారు. కస్టమర్‌కు హిందీ, ఇంగ్లీష్‌ రాని పక్షంలో ఉద్యోగులే లోకల్ భాష తప్పనిసరిగా మాట్లాడగలిగేలా ఉండాలని మోహన్‌దాస్‌ పాయ్‌ చెప్పుకొచ్చారు.

Exit mobile version