Site icon NTV Telugu

Leopard Attack: పర్యాటకుల వాహనంపై దూసుకొచ్చిన చిరుతపులి..

Untitled Design (24)

Untitled Design (24)

బెంగళూరులోని బన్నెర్ఘట్ట నేషనల్ జూ పార్క్ లో పర్యాటకుల వాహనంపై చిరుత పులి దూసుకు వచ్చింది. దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు పర్యాటకులు. వాహనంలో ఉన్న ఓ మహిళ పులిని గమనిస్తుండగా.. ఒక్కసారిగా ఆమెపై దూసుకొచ్చింది. కొద్దిలో ఆమె పులి దాడి నుంచి తప్పించుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. . ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read Also: Jubilee Hills Election Results: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు..

బన్నెర్ఘట్ట జాతీయ ఉద్యానవనంలో సఫారీ చేస్తున్న పర్యాటకుల వాహనంపై ఓ చిరుత దాడి చేసింది. ఈ దాడిలో ఓ మహిళ గాయపడింది. గురువారం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగిందని జూ అధికారులు తెలిపారు. అయితే 10 మందికి పైగా సందర్శకులు పార్క్‌లోని సఫారీ జోన్ గుండా వెళ్తున్నారని.. అయితే… వాహనంలో ఉన్న 50 ఏళ్ల వాహిత్ బాను అనే మహిళ తన భర్త, కుమారుడితో కలిసి వాహనం కిటికీలోంచి పార్క్‌లోని జంతువులను చూస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఒక్కసారిగా వారిపై దాడికి ప్రయత్నించిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో వాహనంలో ఉన్న వారంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మహిళకు చిన్న గాయమైంది. వెంటనే జూ సిబ్బంది.. వాహనాన్ని వేరే ప్లేస్ కు తరలించారు. అనంతరం మహిళను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించామని తెలిపారు జూ సిబ్బంది.

Read Also:Investement: మీరు ఒకే సారి మొత్తం అమౌంట్ తో ఇళ్లు కొనాలనుకుంటున్నారా.. అయితే ఇలా ట్రై చేయండి

సఫారీల సమయంలో భద్రతా సూచనలను జాగ్రత్తగా పాటించాలని అధికారులు తెలిపారు .. వాహనంలో నుంచి తల, చేతులు బయట పెట్టవద్దని జూ అధికారులు పర్యాటకులకు సూచించారు. చిరుతపులులు స్వతహాగా దూకుడుగా వ్యవహరించవని.. అవి ఆసక్తిగా లేదా ఆశ్చర్యపోయినప్పుడు ఇలా ప్రవర్తిస్తాయని అధికారులు చెబుతున్నారు.

Exit mobile version