NTV Telugu Site icon

Tamil Nadu: సింగిల్ నిమ్మకాయకి వేలంలో రూ.35,000 ధర..

Tamil Nadu

Tamil Nadu

Tamil Nadu: మాములుగా నిమ్మకాలకు ఎంత ధర ఉంటుంది..? మహా అయితే రూ. 10కి మించదు. కానీ తమిళనాడులో ఓ ఆలయంలోని నిమ్మకాయ మాత్రం ఏకంగా రూ. 35,000 ధర పలికింది. తమిళనాడులోని ఓ గ్రామంలో ప్రైవేటు ఆలయంలో జరిగిన వేలం పాటులో ఇంత ధర పలకడం చూసి సామాన్యుడు అవాక్కవుతున్నాడు. ఈరోడ్ జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలోని శివగిరి గ్రామ సమీపంలోని పాతపూసయన్ ఆలయంలో శుక్రవారం రాత్రి మహా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా శివుడికి సమర్పించిన నిమ్మకాయలు, పండ్లతో పాటు ఇతర వస్తువులను ఆచారం ప్రకారం వేలం వేశారు.

Read Also: YSRCP: ఎన్ని పార్టీలు ఏకమై గుంపుగా వచ్చినా సీఎం జగన్ యుద్ధానికి ‘సిద్ధం’..

వేలంలో 15 మంది భక్తులు పాల్గొనగా, ఈరోడ్‌కి చెందిన ఒక భక్తుడు సింగిల్ నిమ్మకాయని రూ.35,000కు దక్కించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. వేలం వేసిన నిమ్మకాయను ఆలయ పూజారి పరమ శివుడి ముందుంచి చిన్న పూజ నిర్వహించి, వందలాది మంది భక్తుల సమక్షంలో వేలంలో అత్యధిక ధర పలికిన వ్యక్తికి తిరిగి అందించారు. ఇలా నిమ్మకాయను దక్కించుకున్న వ్యక్తి రానున్న కాలంలో మంచి ధనవంతుడు, మంచి ఆరోగ్యం కలవాడుగా ఆశీర్వదింపబడతాడని భక్తుల నమ్మకం.