Site icon NTV Telugu

JNUSU: జేఎన్‌యూ విద్యార్థి సంఘం ఎన్నికల్లో లెఫ్ట్ కూటమి అఖండ విజయం..

Jnusu

Jnusu

JNUSU: జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం (JNUSU) ఎన్నికల్లో ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA), స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI), మరియు డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫ్రంట్ (DSF) ల సంకీర్ణమైన లెఫ్ట్ యూనిటీ అలయన్స్ అఖండ విజయం సాధించింది. నాలుగు సెంట్రల్ ప్యానెల్ పదవుల్ని కైవసం చేసుకుంది. క్యాంపస్‌లో పూర్తి ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది.

Read Also: Bihar Election 2025: బీహార్ తొలి విడతలో 64 శాతం ఓటింగ్.. రాష్ట్ర చరిత్రలోనే అత్యధికం..

AISA కి చెందిన అదితి మిశ్రా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)కి చెందిన వికాస్ పటేల్‌ను 449 ఓట్ల తేడాతో ఓడించారు. SFI కి చెందిన కిజాకూట్ గోపికా బాబు ఉపాధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నారు. ABVP కి చెందిన తాన్య కుమారిని ఓడించారు. జనరల్ సెక్రటరీ పదవికి తీవ్రమైన పోటీ ఎదురైంది. DSF నుండి సునీల్ యాదవ్, ABVP నుంచి పోటీలో ఉన్న రాజేశ్వర్ కాంత్ దూబేను కేవలం 74 ఓట్ల తేడాతో ఓడించారు. సునీల్ యాదవ్‌కు 1915 ఓట్లు రాగా, దూబేకు 1841 ఓట్లు వచ్చాయి. జాయింట్ సెక్రటరీ పదవిని AISAకి చెందిన డానిష్ అలీ 1991 ఓట్లు సాధించి గెలుచుకున్నారు. ఇదే స్థానానికి ABVP నుంచి పోటీ చేసిన అనుజ్ డమారాకు 1762 ఓట్లు వచ్చాయి. నాలుగు ప్రధాన పోస్టుల్ని కైవసం చేసుకుని లెఫ్ట్ కూటమి క్లీన్ స్వీప్ చేసింది.

Exit mobile version