ఓ మహిళను లాయర్ వెంటపడి మరీ చితకబాదిన ఘటన మధ్యప్రదేశ్‌లోని షాదోల్ జిల్లాలో చోటు చేసుకుంది. అది కూడా కోర్టు ప్రాంగణంలోనే! చుట్టుపక్కలున్న జనాలు సైతం చూస్తుండిపోయారే తప్ప, అతడ్ని ఆపే ప్రయత్నం చేయలేదు. ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా, అది వైరల్ అయ్యింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
భారతి పటేల్(23) అనే ఓ మహిళ తన భర్త నుంచి విడాకులకు దరఖాస్తు చేసుకుంది. ఈ క్రమంలోనే భరణం కోసం కోర్టులో పిటిషన్ వేసింది. ఈ కేసులో ఆమె భర్త తరఫున న్యాయవాది భగవాన్ సింగ్(58) వాదిస్తున్నారు. ఈ పిటిషన్ వాదనలకు భార్యాభర్తలు హాజరైనప్పుడు, వారి మధ్య వాగ్వాదం జరిగింది. ముఖ్యంగా, భారతి చెలరేగిపోయింది. ఈ క్రమంలోనే ఆమె తీరుతో చిర్రెత్తుకొచ్చిన లాయర్.. ఆమెపై దాడి చేశాడు. అతని నుంచి తప్పించుకు పారిపోదామని ప్రయత్నించినా, ఆ లాయర్ వెంటపడి మరీ ఆమె కొట్టాడు. కేకలు వేస్తూ, తనని వదిలేయమని ప్రాధేయపడుతున్నా ఆ లాయర్ వదిలిపెట్టలేదు. కోర్టు సముదాయంలోనే ఇదంతా జరిగింది.
మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు ఈ మొత్తం వ్యవహారాన్ని ఏదో సినిమా చూస్తున్నట్టు చూస్తుండిపోయారే తప్ప, అతడ్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఈ ఘటనని కెమెరాలో బంధించి నెట్టింట్లో పెట్టగా.. అది వైరల్ అయ్యింది. గురువారం ఈ ఘటన జరిగిందని, బాధితురాలి ఫిర్యాదు మేరకు లాయర్ భగవాన్ సింగ్‌పై కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. అయితే.. ఈ దాడి విషయం తమ దృష్టికి ఇంకా రాలేదని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాకేష్ సింగ్ బాఘెల్ అన్నారు. తమ దృష్టికొస్తే, కచ్ఛితంగా ఆ లాయర్‌పై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

Shameful…
Lawyer ran and beat woman in Shahdol court premises, woman's child kept crying on the ground@dmshahdol @unwomenindia #tajinderbagga #TeJran #JanhitMeinJaari #bangalorerains pic.twitter.com/uEWPQhrmHj
— Subham Anand (@anand_subham1) May 6, 2022