Site icon NTV Telugu

Puja khedkar: ఆరోపణలపై పూజా రియాక్షన్.. చట్టం తన పని చేసుకుపోతుందని వ్యాఖ్య

Iaspujakhedkar

Iaspujakhedkar

తనపై వచ్చిన ఆరోపణలపై రీకాల్ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ తొలిసారి స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆమె వ్యాఖ్యానించారు. ఏవైనా ప్రశ్నలుంటే యూపీఎస్‌కు సమాధానం ఇస్తానని.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడతానని ఆమె వ్యాఖ్యానించారు. కంటి చూపు, మానసిక వైకల్యంపై తప్పుడు పత్రాలు సమర్పించినందుకు ఆమెపై దర్యాప్తు సాగుతోంది. ఈ నేపథ్యంలో యూపీఎస్సీ ఆమె ఎంపికను రద్దు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సివిల్ సర్వీసెస్ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు ఆమె అన్నింటినీ తప్పుడుగా చూపించింది. చివరికి ఆమె తల్లిదండ్రుల పేర్లు కూడా మార్చినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే యూపీఎస్సీ.. షోకాజ్ నోటీసు ఇచ్చింది. ఆమె సమాధానంపైనే భవిష్యత్ ఆధారపడి ఉంది. మరోవైపు ఢిల్లీ పోలీసులు కూడా ఆమెపై కేసు నమోదు చేశారు. వికలాంగుల హక్కులు, ఐటీ చట్టం కింద ఫోర్జరీ ఆరోపణలపై ఎఫ్‌ఐఆర్ బుక్ చేశారు.

పూజా ఖేద్కర్‌కు ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం.. శిక్షణ కార్యక్రమాన్ని నిలిపివేసింది. మరోవైపు కేంద్రం కూడా ఏకసభ్య కమిటీ వేసింది. ఈ కమిటీ త్వరలో నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదిక తర్వాత కేంద్రం కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఆమె తల్లి మనోరమా రైతుల్ని బెదిరించిన కేసులో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆమెపై మర్డర్ కేసు నమోదు చేశారు.

Exit mobile version