కరోనా కేసులు విలయం కొనసాగుతున్న నేపథ్యంలో.. పెట్రో ధరలు పెరుగుదల సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో సెంచరీ కూడా దాటేశాయి. అయితే, తాజాగా వాహనదారులకు పెట్రోల్ ధరలు షాక్ ఇచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పై 36 పైసలు, లీటర్ డీజిల్ పై 38 పైసలు పెరిగింది. ఈ పెరుగుదలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.11 చేరగా.. లీటర్ డీజిల్ ధర రూ. 88.65 కు చేరింది.
read more : కరోనా బాధిత కుటుంబాలకు భారీ ఊరట..
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో సెంచరీకి చేరింది. లీటర్ పెట్రోల్ ధర రూ. 104.22 చేరగా.. డీజిల్ ధర రూ. 96.16 కు చేరింది. ఇక హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.96 చేరగా.. డీజిల్ ధర రూ. 96.63 కు చేరింది. ఇటు ఏపీలోని కొన్ని జిల్లాల్లో పెట్రోల్ ధరలు సెంచరీ కొట్టిన సంగతి తెలిసిందే. విజయవాడ విషయానికి వస్తే లీటర్ పెట్రోల్ ధర రూ. 104.50 గా నమోదైంది.
