NTV Telugu Site icon

Laser weapon: భారత అమ్ములపొదిలో ‘‘లేజర్ వెపన్’’.. క్షణాల్లో డ్రోన్‌లు ఖతం.. వీడియో వైరల్..

Laser Directed Weapon(dew) Mk Ii(a)

Laser Directed Weapon(dew) Mk Ii(a)

Laser weapon: భారత అమ్ములపొదిలో మరో కొత్త అస్త్రం చేరింది. లేజర్ డైరెక్టెడ్ వెపన్(DEW) MK-II(A), సులభంగా చెప్పాలంటే లేజర్ ఆయుధాన్ని విజయవంతంగా పరీక్షించింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) తయారు చేసిన వ్యవస్థ ముఖ్యంగా ‘‘డ్రోన్‌’’లను టార్గెట్ చేస్తుంది. డ్రోన్‌లను ట్రాక్ చేసి, లేజర్ బీమ్‌ని ఉపయోగించి టార్గెట్‌ని నాశనం చేస్తుంది.

ఉక్రెయిన్, ఆర్మేనియా యుద్ధాల్లో డ్రోన్‌ల ప్రాధాన్యం పెరగడంతో, వీటిని నాశనం చేసే ఆయుధాన్ని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఇది భారత సాయుధ దళాలకు గేమ్ చేంజర్‌గా మారబోతోంది. కర్నూలులో వెహికల్ మౌంటెడ్ లేజర్ డైరెక్టెడ్ వెపన్ (DEW) MK-II(A) యొక్క ల్యాండ్ వెర్షన్‌ని DRDO విజయవంతంగా పరీక్షించింది. దీని ద్వారా ఒక ఫిక్స్‌డ్ వింగ్ UAV అండ్ స్వార్మ్ డ్రోన్‌లను విజయవంతంగా నాశనం చేసిందని డీఆర్డీఓ ఒక ప్రకటనలో తెలిపింది.

Read Also: BJP: ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్‌పై “కన్హయ్య కుమార్” అనుచిత వ్యాఖ్యలు.. బీజేపీ ఫిర్యాదు..

ఇలాంటి లేజర్ ఆయుధాలు కలిగిన అతికొద్ది దేశాల సరసన భారత్ చేరింది. ఇలాంటి లేజర్ ఆయుధం ప్రపంచంలో అమెరికా, రష్యా, చైనాల వద్ద మాత్రమే ఉందని, ఇజ్రాయిల్ కూడా ఇలాంటి సామర్థ్యాలపై పనిచేస్తోందని, ఇలాంటి వ్యవస్థ కలిగిన నాలుగో దేశం లేదా ఐదో దేశం భారత్ అని DRDO చైర్మన్ సమీర్ వి కామత్ చెప్పారు. ఇది ప్రారంభం మాత్రమే అని, మేము అధిక శక్తి మైక్రోవేవ్‌లు, విద్యుదయస్కాంత పల్స్ వంటి ఇతర హై ఎనర్జీ వ్యవస్థలపై కూడా పనిచేస్తున్నామని వెల్లడించారు.

DEW వ్యవస్థ, సుదూర పరిధిలోని ఫిక్స్‌డ్ వింగ్ డ్రోన్‌లను కూల్చివేసింది. మల్టీ డ్రోన్లను అడ్డుకుంది. శత్రువు నిఘా సెన్సార్లు, యాంటెన్నాలను నాశనం చేసింది. మెరుపు వేగంతో దాడి చేయడం, ఖచ్చితత్వం కొన్ని సెకన్లలో లక్ష్యాన్ని నాశనం చేయడం దీని ప్రత్యేకత. రాడార్ ద్వారా లేదా దాని ఇన్‌బిల్ట్ ఎలక్ట్రో ఆప్టిక్(EO) వ్యవస్థ ద్వారా డ్రోన్లను గుర్తించిన తర్వాత లేజర్ కాంతితో లక్ష్యాన్ని ఛేదిస్తుంది. శక్తివంతమైన కాంతి పుంజాన్ని ఉపయోగించి నాశనం చేయగలదు.