NTV Telugu Site icon

Rahul Gandhi: కేరళ విలయం.. జాతీయ విపత్తే

Rahulgandhipriyankagandhi

Rahulgandhipriyankagandhi

కేరళ విలయం తన దృష్టిలో జాతీయ విపత్తు అని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. గురువారం సోదరి ప్రియాంకాగాంధీతో కలిసి రాహుల్ వయనాడ్‌ ప్రకృతి విపత్తు జరిగిన ప్రాంతాలను సందర్శించారు. బాధితుల్ని పరామర్శించి ఓదార్చారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాహుల్ మీడియాతో మాట్లాడారు. కేరళ విలయంలో భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందని చెప్పారు. కేరళకు జరిగిన నష్టం దేశానికి తీరని విషాదంగా పేర్కొన్నారు. ఇది రాజకీయాలకు సమయం కాదని.. బాధితులందరికీ అవసరమైన సాయం అందించడానికే ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నుంచి బాధితులకు రావాల్సిన సాయం అందేవరకు కాంగ్రెస్‌ పోరాడుతుంద్నారు. ఇలాంటి విపత్తులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. దీనిపై సమగ్ర కార్యచరణ ప్రణాళిక అవసరం అని రాహుల్‌ తెలిపారు.

దేశంలోనే అత్యంత భయంకరమైన విషాద ఘటన వయనాడ్‌లో చోటు చేసుకొందన్నారు. ప్రజలు తమ ఇళ్లు, కుటుంబ సభ్యులను కోల్పోవడం బాధాకరం అని వ్యాఖ్యానించారు. ఇలాంటి సమయంలో వారిని ఏ విధంగా ఓదార్చాలో తెలియడం లేదని. తన తండ్రి రాజీవ్‌ గాంధీ చనిపోయినప్పుడు ఎలా బాధపడ్డానో.. ఈరోజు అలాగే అనిపిస్తోందని రాహుల్ భావోద్వేగానికి గురయ్యారు.

మంగళవారం వయనాడ్‌లో జరిగిన భారీ విపత్తుకు దాదాపు 250 మందికి పైగా చనిపోయారు. వందలాది మంది గల్లంతయ్యారు. ఇంకొందరు తీవ్ర గాయాలు పాలయ్యారు. ఇంకోవైపు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగిస్తున్నారు. మరోవైపు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. గత మూడు రోజులుగా ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాల సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.