Laluprasad Yadav: ఐసీయూలో లాలూ.. ‘నాన్మ మీరే నా హీరో’ అంటూ రోహిణి భావోద్వేగ పోస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ రెండు రోజుల క్రితం మెట్లపై నుంచి జారీపడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో ఆయన వీపుకు గాయమయింది. భుజం విరిగింది. ఈ నేపథ్యంలో ఆయన పాట్నాలోని పారస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. లాలూ ఇప్పటికే పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మూత్రపిండ మార్పిడి చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఆయనకు ఈ ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో ఆయన కుమార్తె రోహిణీ ఆచార్య తండ్రి ఆరోగ్య పరిస్థితి పట్ల భావోద్వేగానికి గురయ్యారు. ట్విటర్ వేదికగా లాలూ చికిత్స పొందుతున్న ఫొటోలను షేర్ చేస్తూ.. నువ్వే నా హీరో నాన్న అంటూ తన ప్రేమను చాటుకున్నారు.
Hyderabad Crime: సర్పదోషం పేరుతో 37 లక్షలు వసూళ్ళు.. ఫేక్ బాబాకు సంకెళ్ళు
Also Read
- Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్‌కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
తన తండ్రి ఆరోగ్య పరిస్థితి పట్ల ఆయన కుమార్తె రోహిణి ఆచార్య తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ‘నాన్నే నా హీరో. నా బ్యాక్ బోన్. త్వరగా కోలుకో నాన్నా. ప్రతి అవరోధం నుంచి విముక్తి పొందిన ఆయన వెంట ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. వారి అభిమానమే ఆయన బలం’ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం రోహిణి ఆచార్య సింగపూర్ ఉంటున్నారు. అక్కడి నుంచి వీడియో కాల్ ద్వారా తండ్రి బాగోగులను అడిగి తెలుసుకుంటున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు. మరోవైపు ఈరోజు ఆర్జేడీ 26వ వ్యవస్థాపక దినోత్సవం. అయితే, తమ అధినేత లాలూ ఆసుపత్రిలో ఉండటంతో వేడుకలకు దూరంగా ఉండాలని పార్టీ నిర్ణయించింది. ఇంకోవైపు, తన చిన్న కుమారుడు తేజస్వి యాదవ్ కు లాలూ పార్టీ పగ్గాలను అప్పగించే అవకాశాలున్నాయనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.
My hero
My backbone Papa🙏
Get well soon 🤞हर बाधाओं से जिसने पाई है मुक्ति
करोड़ों लोगों की दुआएं है जिनकी शक्ति🙏 pic.twitter.com/36ndAbRnTG— Rohini Acharya (@RohiniAcharya2) July 5, 2022
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!