NTV Telugu Site icon

Constable Shalini Chauhan: లేడీ కానిస్టేబుల్‌కి హ్యాట్సాఫ్.. స్టూడెంట్‌గా మారి, ఆ కేసుని ఛేధించింది

Constable Shalini Chauhan

Constable Shalini Chauhan

Lady Constable Shalini Chauhan Turned As Student To Solve Ragging Case: ఒక మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కేసును ఛేధించడానికి.. ఓ లేడీ కానిస్టేబుల్ సాహసోపేతమైన ఆపరేషన్ చేపట్టింది. స్టూడెంట్‌గా అవతారమెత్తి.. ఏ ఒక్కరికీ అనుమానం రాకుండా.. మూడు నెలల పాటు ర్యాగింగ్ కేసుకు సంబంధించి తగిన ఆధారాలు సేకరించి.. ఐదు నెలల నుంచి ముందుకు కదలని ఆ కేసుని కొలిక్కి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది. అచ్చం త్రిల్లర్ సినిమా స్టోరీని తలపించే ఈ ఘటన.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

Mandous Cyclone : చెన్నైలో చెత్త.. రేయింబవళ్లు తిరుగుతున్న టిప్పర్లు

ఇండోర్‌లోని ఎంజీఎం మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ పేరుతో జూనియర్ల పట్ల సీనియర్లు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదులు అందాయి. కొందరైతే శృతి మించి.. చాలా అభ్యంతరకరంగా వ్యవహరించారని కూడా ఆరోపించారు. అయితే.. ఈ ఫిర్యాదులు పోలీసులకు నేరుగా అందలేదు. అంటే, జూనియర్లేమీ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కేసు పెట్టలేదు. అలా పెడితే.. భవిష్యత్తులో తమకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోనన్న భయంతో జూనియర్లు కంప్లైంట్ చేయలేదు. కానీ.. టెక్నాలజీ సహాయంతో వాళ్లు తమ ఫిర్యాదుల్ని అందజేశారు. తమ పేరు బయటపడకుండా.. ర్యాగింగ్ వివరాల్ని, గూగుల్ మ్యాప్ లొకేషన్‌ని పోలీసులకు పంపించారు. ర్యాగింగ్ చేస్తున్న సీనియర్లపై చర్యలు తీసుకోవాలని ప్రాధేయపడ్డారు. దీంతో.. ఈ కేసుని ఛేధించడం కోసం పోలీసులు ఒక అండర్ కవర్ ఆపరేషన్ చేపట్టారు.

Dry Cough: పొడి దగ్గు తగ్గట్లేదా.. ఈ చిట్కాలతో వెంటనే ఉపశమనం

ఈ ఆపరేషన్ కోసం సంజయ్, రింకు, షాలిని చౌహాన్‌తో పాటు మరికొందరిని ఎంపిక చేశారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా.. షాలిని చౌహాన్ (24) స్టూడెంట్ అవతారం ఎత్తింది. భుజాన బ్యాగ్ ఎత్తుకొని, ఎంజీఎం క్యాంపస్‌లో అడుగుపెట్టింది. మూడు నెలలపాటు క్యాంపస్‌లోనే గడిపింది. ఈ సమయంలో తాను పోలీస్ కానిస్టేబుల్ అని ఏ ఒక్కరికీ అనుమానం రాకుండా, జాగ్రత్తలు తీసుకుంది. అక్కడి స్టూడెంట్స్‌తో స్నేహం చేసి, వారికి డౌట్ రాకుండా ర్యాగింగ్‌కి సంబంధించిన వివరాల్ని సేకరించింది. క్యాంటీన్‌లో రోజుకు నాలుగైదు గంటలు గడిపించింది. ర్యాగింగ్‌కు పాల్పడిన 11 మంది సీనియర్ స్టూడెంట్ల కదలికల్ని, వారి చర్యల్ని ఓ కంట కనిపెట్టింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా సేకరించిన వివరాల్ని, ఉన్నతాధికారులకు సమర్పించింది.

Baaz Electric Scooter: 35 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్స్ చూస్తే దిమ్మతిరగాల్సిందే!

ఇలా షాలిని సేకరించిన వివరాల ఆధారంగా.. పోలీసులు ఈ కేసుని ఛేధించగలిగారు. ఎవరైతే ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు చేశారో, వారిని పోలీస్ స్టేషన్‌కి పిలిపించి, విచారణకు సహకరించాలని కోరారు. ఈ విషయం తెలుసుకున్న స్టూడెంట్స్.. ఇంత తతంగం నడిచిందా? అంటూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ ఆపరేషన్‌తో షాలిని చౌహాన్ ‘రియల్ హీరో’గా మారింది. నెట్టింట్లో ఆమెకు నెటిజన్లు నీరాజనాలు పలుకుతున్నారు.