Site icon NTV Telugu

Manipur: జాతీయ రహదారిని దిగ్భంధించిన కుకీ సంఘాలు

Manipur

Manipur

Manipur: మణిపూర్‌లో మరోసారి జాతీయ రహదారిని దిగ్భంధిస్తున్నట్టు కుకీ సంఘాలు ప్రకటించాయి. దీంతో సోమవారం తెల్లవారు జామునుంచి దిమాపూర్-ఇంఫాల్ జాతీయ రహదారి 2 దిగ్బంధనాన్ని తిరిగి విధిస్తున్నట్లు కుకీ సంఘాలు ప్రకటించాయి. రహదారి దిగ్బంధనంతో మెయిటీ ప్రజలు నివసించే లోయ ప్రాంతాలకు నిత్యావసరాల సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉంది. కుకీ-జో కమ్యూనిటీని రక్షించడంలో భారత ప్రభుత్వం విఫలమైనందుకు మరియు సరకులను స్వేచ్ఛగా తరలించడంలో విఫలమైనందుకు నిరసనగా హైవేను దిగ్బంధిస్తున్నట్టు గిరిజన ఐక్యతపై కమిటీ (సీవోటీయూ), కాంగ్‌పోక్పి ఒక ప్రకటనలో తెలిపింది. గత వారం నాగా జాతి అధికంగా ఉండే ఉఖ్రుల్‌ జిల్లాలో ఓ కుకీ-జొ విలేజ్‌ వాలంటీరు హత్యకు గురయ్యాడు. మరోవైపు చురాచాంద్‌పుర్‌, తెంగ్నౌపాల్‌ వంటి పర్వత ప్రాంత జిల్లాలకు నిత్యావసరాలను సరఫరా చేసే మార్గాన్ని మైయిటీలు మూసివేశారని సీనియర్‌ పోలీస్‌ అధికారి తెలిపారు. ఆగస్టు 19న అస్సాం రైఫిల్స్‌ కాన్వాయ్‌ ముఖ్యమైన ఔషధాలు, పిల్లల టీకాలను తీసుకొని ముందుకెళ్లలేకపోయింది. దీంతో హెలికాప్టర్లలో ఔషధాలను తరలించాల్సి వచ్చింది. వీటితోపాటు కాంగ్పోక్కి, సేనాపతి జిల్లాలకు కూడా ఔషధాల తరలింపును అడ్డుకొన్నారని చెప్పారు.

Read also: CM KCR: బీఆర్ఎస్ తొలి జాబితా ప్రకటన… మధ్యాహ్నం 2.30కి కేసీఆర్ ప్రెస్ మీట్..

“NH-2 వెంట నిత్యవసర వస్తువులతో వస్తున్న163 వాహనాలకు భద్రత కల్పించామని. హాని కలిగించే ప్రదేశాలలో కఠినమైన భద్రతా చర్యలు తీసుకోబడ్డాయని మణిపూర్ పోలీసులు ఆదివారం ట్విట్టర్‌ X లో పోస్ట్ చేశారు. వాహనాలు స్వేచ్ఛగా మరియు సురక్షితంగా తిరగడానికి సున్నితమైన ప్రాంతాల్లో భద్రతా కాన్వాయ్‌ని ఏర్పాటు చేసినట్టు పోలీసులు ప్రకటించారు. గిరిజనులు అధికంగా ఉండే కాంగ్‌పోక్పి మరియు సేనాపతి జిల్లాలకు ఆగస్టు 18న సెక్‌మైలో వైద్య సరఫరాలు నిలిచిపోయాయని అధికారులు తెలిపారు. పోలీసులు జోక్యం చేసుకొని మందులను ధ్వంసం చేయకుండా అడ్డుకున్నట్టు తెలిపారు.
మే 3 నుండి కుకీ మరియు మెయిటీ కమ్యూనిటీల మధ్య జాతి హింస కారణంగా రాష్ట్రం ప్రభావితమైంది మరియు ఇప్పటివరకు 160 మందికి పైగా మరణించారు. అస్తిత్వం లేని కుకీ డెమోక్రటిక్ ఫ్రంట్ మరియు కుకీ సోదరులను లోక్‌సభలో తప్పుగా ఆరోపించిన తన ప్రకటనను ఉపసంహరించుకోవాలని సీవోటీయూ హోం మంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేసింది. ‘వాహనాలు ఎటువంటి అంతరాయం లేకుండా వెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. అస్సాం రైఫిల్స్‌కు చెందిన కాన్వాయ్‌లు ఆదివారం చురచంద్‌పూర్‌కు తరలివెళ్లాయని అధికారులు తెలిపారు. గత జూలై 3న, కేంద్రంతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్న గిరిజన సంఘాలు మరియు కుకీ తిరుగుబాటు గ్రూపులతో తీవ్ర చర్చల తర్వాత దిమాపూర్-ఇంఫాల్ జాతీయ రహదారి-2 వద్ద దిగ్బంధనం ఎత్తివేయగా.. ఇపుడు తిరిగి దిగ్భందాన్ని కొనసాగిస్తున్నాయి.

Exit mobile version