NTV Telugu Site icon

KTR: బల్క్ డ్రగ్ పార్క్ కేటాయింపులో తెలంగాణకి మోదీ సర్కార్ మొండి చేయి.

Minister Ktr

Minister Ktr

KTR blamed the center on the bulk drug park: తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి ప్రధాని నరేంద్రమోదీ సర్కార్ పై విరుచుకుపడ్డారు. తెలంగాణకు మోదీ సర్కార్ మొండి చేయి చూపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బల్క్ డ్రగ్ పార్క్ కేటాయింపులో తెలంగాణకి మోదీ సర్కార్ మొండి చేయి చూపించిందని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణపై వివక్షతో దేశ ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం తాకట్టు పెడుతోందని ఆరోపించారు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పుతున్న హైదరాబాద్ ఫార్మాసిటీ ఎంతో అనుకూలం అని కేటీఆర్ అన్నారు.

Read Also: Madhya Pradesh: విద్యార్థుల స్కూల్ బ్యాగుల బరువు తగ్గించేందుకు ప్రభుత్వ కీలక నిర్ణయం

భూసేకరణ, పర్యావరణ అనుమతులు, మాస్టర్ ప్లానింగ్ తో సిద్ధంగా ఉన్న ఫార్మా సిటీని కావాలనే కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. మారుతున్న ప్రపంచ రాజకీయాల నేపథ్యంలో బల్క్ డ్రగ్ పార్క్ ల ఏర్పాటు అత్యవసరమన్న కేంద్రం.. మరో నాలుగేళ్లు అయినా పట్టాలు ఎక్కని ప్రాంతాలకు కేటాయించారని ఆయన విమర్శించారు. కొత్తగా బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయాలంటే కనీసం మూడేళ్లైన పడుతుందని కేటీఆర్ అన్నారు. అన్ని సిద్ధంగా ఉన్న హైదరాబాద్ ఫార్మా సిటీని పరిగనలోకి తీసుకోకపోవడం, ఫార్మా రంగాన్ని ఆత్మనిర్భరత దిశగా స్వయం సమృద్ధి చేయాలన్న లక్ష్యంపై కేంద్రానికి ఉన్న అలసత్వానికి నిదర్శనం అని ఆయన విమర్శించారు.

అన్ని అనుకూలతలు, అనుమతులతో సిద్ధంగా ఉన్న హైదరాబాద్ ఫార్మాసిటీకి మొండిచేయి ముమ్మాటికి వివక్షే అని కేటీఆర్ అన్నారు. వెంటనే బల్క్ డ్రగ్ పార్క్ కేటాయించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. గతం నుంచి కేంద్రం తీరుపై టీఆర్ఎస్ నాయకులు విమర్శలు కురిపిస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపిస్తోందని సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు, టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. కేంద్రం, తెలంగాణకు చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదని ఆరోపిస్తోంది టీఆర్ఎస్. తెలంగాణ డెవలప్మెంట్ ను కేంద్రం తట్టుకోలేకపోతుందని, ఆసూయతోనే నిధులు ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది.