NTV Telugu Site icon

UNESCO: కోజికోడ్, గ్వాలియర్ నగరాలకు యునెస్కో గుర్తింపు.. క్రియేటివ్ సిటీస్ జాబితాలో చోటు..

Uccn

Uccn

UNESCO: వరల్డ్ సిటీస్ డే రోజున దేశంలోని కోజికోడ్, గ్వాలియర్ నగరాలకు అరుదైన గుర్తింపు లభించింది. ప్రతిష్టాత్మక యునెస్కో క్రియెటివ్ సిటీస్ నెట్వర్క్‌లో చోటు లభించింది. 55 కొత్త నగరాల జాబితాలో ఈ రెండు నగరాలకు చోటు లభించింది. ఐక్యరాజ్యసమితి మంగళవారం ఈ జాబితాను విదుదల చేసింది. జాబితాలో భారతీయ నగరాలు చోటు సంపాదించుకోవడం గర్వకారణమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సంస్కృతి, సృజనాత్మకతను ఉపయోగించుకోవడంలో ఈ నగరాలు నిబద్ధతను కలిగి ఉన్నాయని ఆయన అన్నారు.

కేరళలోని కోజికోడ్ కేరళ లిటరేషచర్ ఫెస్టివల్, అనేక బుక్ ఫెస్టివల్స్ కి వేదికగా ఉంది. దీంతో కోజికోడ్ ను యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్(UCCN) మంగళవారం ‘సిటీ ఆఫ్ లిటరేచర్’గా పేర్కొంది. ఈ జాబితాలో చోటు లభించిన తొలి నగరంగా కోజికోడ్ రికార్డు సృష్టించింది

Read Also: Iran: ఇజ్రాయిల్‌కి ఆయిల్, ఆహారం నిలిపేయండి.. ముస్లిం దేశాలు ఇరాన్ సుప్రీంలీడర్ పిలుపు

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ను యునెస్కో “సిటీ ఆఫ్ మ్యూజిక్”గా ప్రకటించింది. లెజెండరీ సంగీతకారుడు తాన్సేస్ ఈ నగరానికి చెందిన వారే. సింధియా ఘరానా వంటి శతాబ్ధాలకు ప్రచారం చేసిన నగరంగా ఈ నగరానికి యునెస్కో తగిన గౌరవం ఇచ్చింది. గ్వాలియర్ సంగీత వారసత్వం సుసంపన్నమైంది. శాస్త్రీయ హిందూస్థానీ సంగీతం, జానపద సంగీతం, భక్తి సంగీతాలకు కేంద్రంగా ఉంది. అనేక సంగీత ఉత్సవాలకు ఈ నగరం నిలయంగా ఉంది.

ఈ రెండు నగరాలతో పాటు బుఖారా (క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్), కాసాబ్లాంకా (మీడియా ఆర్ట్స్), చాంగ్‌కింగ్ (డిజైన్), ఖాట్మండు (సినిమా), రియో డి జనీరో (సాహిత్యం) మరియు ఉలాన్‌బాతర్ (క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్) వంటి నగరాలు జాబితాలో చోటు దక్కించుకున్నాయి. UCCN 100 పైగా దేశాల్లో 350 నగరాలను గుర్తించింది. క్రాఫ్ట్స్, జానపద కళలు, డిజైన్, ఫిల్మ్, గ్యాస్ట్రోనమీ, సాహిత్యం, మీడియా ఆర్ట్స్, సంగీతం వంటి 7 క్రియేటివ్ ఆర్ట్స్ లో నగరాలను గుర్తిస్తుంది.