NTV Telugu Site icon

Delhi coaching centres: విద్యార్థుల మృతి తర్వాత యాక్షన్.. లైబ్రరీలు మూసివేత

Delhicoachingcentre

Delhicoachingcentre

చేతులు కాలాక.. ఆకులు పట్టుకోవడమంటే ఇదేనేమో.. విపత్తు జరిగితేనే తప్ప అధికారులు మొద్ద నిద్ర వీడరేమో. ఇటీవల ఢిల్లీలో కురిసిన భారీ వర్షానికి ఓ కోచింగ్ సెంటర్‌ సెల్లార్‌లోకి నీళ్లు ప్రవేశించి లైబ్రరీలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు జలసమాధి అయిపోయారు. ఈ ఘటనతో అధికారులు మేల్కొన్నారు. అక్రమ కట్టడాల్లో ఇష్టానుసారంగా కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్న ఇనిస్టిట్యూట్‌లపై కొరడా ఝుళిపిస్తు్న్నారు.

ఇది కూడా చదవండి: Paris Olympics 2024: ఒలింపిక్స్‌ లోగోలోని 5 రింగుల అర్థం అదేనా?

తాజాగా బేస్‌మెంట్‌లో లైబ్రరీలు నిర్వహిస్తున్న 10 గ్రంథాలయాలను అధికారులు మూసివేశారు. అలాగే కల్పతరు బేస్‌మెంట్‌లో నిర్వహిస్తున్న పంజాబీ మెస్‌ను కూడా అధికారులు సీజ్ చేశారు. అగ్నిమాపక, పోలీస్ శాఖ సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో బేస్‌మెంట్లలో నిర్వహిస్తున్న 10 లైబ్రరీలను క్లోజ్ చేశారు. అంతేకాకుండా యాజమాన్యాలకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఇదిలా ఉంటే అక్రమంగా నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో అధికారులు చర్యలకు పూనుకున్నారు.

ఇది కూడా చదవండి: IND vs SL T20: ఆదిలోనే వరుస వికెట్లను కోల్పోయిన భారత్..