Kolkata: కోల్‌కతాలో కూలిన గోదాం.. 8 మంది మృతి
- కోల్‌కతాలో ఘోర విషాదం
- కూలిన నిర్మాణంలో ఉన్న గోదాం
- 8 మంది మృతి.. పలువురికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్‌కతాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న గిడ్డంగి పైకప్పు కూలిపోవడంతో ఘోర ప్రమాదం జరిగింది. 40 నుంచి 45 మంది చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 8 మంది చనిపోగా.. మరికొందరు తీవ్రగాయాల పాలైనట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.
కోల్‌కతాలోని తారతల పోలీస్ స్టేషన్ పరిధిలోని ట్రాన్స్పోర్ట్ డిపో రోడ్డులో నిర్మాణంలో ఉన్న ఒక గిడ్డంగి పైకప్పు కూలిపోయింది. పెద్ద సంఖ్యలో కార్మికులు అందులో చిక్కుకుపోయినట్లు భావిస్తున్నారు. పెద్ద సంఖ్యలో కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాంతం పశ్చిమ కోల్‌కతా పరిధిలోకి వస్తుంది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, పరిపాలనా బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక, రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. విపత్తు నిర్వహణ బృందం, పౌర రక్షణ బృందాలతో పాటు అగ్నిమాపక యంత్రాలను కూడా సంఘటనా స్థలానికి పంపినట్లు కోల్‌కతా పోలీసులు తెలిపారు.
Also Read
- Saudi-Houthi war: భారతీయుల పడవపై సౌదీ దాడి.. 14 మందిని రక్షిస్తున్న హౌతీలు..
- Neha Bora: ‘‘CJP నిరసనతో సంబంధం లేదు’’.. ఢిల్లీ హైకోర్టులో నేహా బోరా..
- Saudi Arabia: సౌదీలో బంగ్లాదేశ్ జంటకు మరణశిక్ష.. భారతీయుడి ప్రమేయం ఉందని పాక్ నెటిజన్ల ప్రచారం.!
- BJP: సంచలన రిపోర్ట్.. రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌పై ‘‘రెజిమ్ ఛేంజ్’’ ఆరోపణలు..
తారతలా ప్రాంతంలో ఈ ప్రమాదం అకస్మాత్తుగా జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. నిర్మాణంలో ఉన్న భవనం పక్కన చాలా మంది పనిచేస్తున్నారు. సహాయక, రెస్క్యూ బృందాలు ఏడుగురిని రక్షించారు. స్థానికులు కూడా సహాయక చర్యలు ప్రారంభించారు. షెడ్లు, శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షిస్తున్నారు. ఈ ఘటనలో పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడి ఉంటారని భావిస్తున్నారు. రక్షించబడిన వారిని పరిపాలనా బృందాలు ఆసుపత్రులకు తరలించాయి. పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ ఘటనలో 40 నుంచి 45 మంది పూడిపోయి ఉండవచ్చని భయపడుతున్నారు.
#WATCH | Kolkata, West Bengal | Cranes deployed to lift the rubble at the site where an under-construction godown shed collapsed in Taratala.
Indian Army arrives on the spot pic.twitter.com/EIEGy0gETL
— ANI (@ANI) June 24, 2026
#WATCH | Kolkata | West Bengal | Search and rescue operation underway at the site where an under-construction godown shed collapsed in Taratala. https://t.co/O68iBSS8Lb pic.twitter.com/rU10750Fnl
— ANI (@ANI) June 24, 2026
తాజావార్తలు
-
Story Board : స్థానిక ఎన్నికల్లో పరిస్థితి అదుపు తప్పితే సుప్రీం జోక్యం తప్పదా ?
-
AP Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే.!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
Akka Trailer: తుపాకీ పట్టిన ‘మహానటి’.. ‘అక్క’ ట్రైలర్‌తో సెన్సేషన్!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
ట్రెండింగ్
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!