Kolkata Rape Case: కోల్‌కతా హత్య కేసులో సీబీఐ, బెంగాల్ సర్కార్‌పై సీరియస్..
- బెంగాల్ సర్కా్ర్ పై మండిపడిన సుప్రీంకోర్టు..
- ఆసుపత్రిలో సీసీటీవీలతో పాటు కనీస సదుపాలు ఏర్పాటు చేయాలని ఆదేశం..
- ట్రైనీ డాక్టర్ కేసులో సీబీఐపై కోల్‌కతా హైకోర్టు ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata Rape Case: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో వైద్యురాలిపై హత్య, ఆర్థిక అవకతవకలపై సీబీఐ విచారణలో కీలకమైన ఆధారాలు బయటకు వచ్చాయని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా బెంగాల్ సర్కార్ పై సీరియస్ అయింది. ఆసుపత్రిలో సీసీటీవీల ఏర్పాటు, మరుగుదొడ్లు, వైద్య సదుపాయాల దగ్గర ప్రత్యేక విశ్రాంతి గదుల నిర్మాణంలో ఆలస్యంపై మమతా బెనర్జీ ప్రభుత్వంపై మండిపడింది సుప్రీంకోర్టు. పనులు ఎందుకు ఆలస్యంగా కొనసాగుతున్నాయి.. మేం ఆగస్టు 9 నుంచి పర్యవేక్షిస్తున్నాం.. జరుగుతున్న పనిని అక్టోబర్ 15 లోపు పూర్తి చేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీ భద్రతలో లోపం.. కాన్వాయ్ పక్కనే కర్ర పట్టుకుని బైక్‌పై వెళ్లిన వ్యక్తి
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
అలాగే, ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆర్థిక అవకతవకల కేసు కోల్‌కతా కోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) తీరుపై ఈరోజు న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ కేసులో పోలీసు ఇన్స్పెక్టర్ అభిజిత్ మోండల్, ఆర్జీ కర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ల దగ్గర నుంచి మరింత సమాచారం సేకరించేందుకు మరింత కస్టడీని కస్టడీని పొడిగించాలని కోరింది. అలాగే, తాలా పోలీస్ స్టేషన్ నుంచి సీసీటీవీ ఫుటేజీతో సహా డీవీఆర్లు, హార్డ్ డిస్కులు, మొబైల్ ఫోన్ల నుంచి సేకరించిన డేటాలో కీలకమైన వాస్తవాలను వెలికితీసినట్లు సీబీఐ పేర్కొనింది.
Read Also: Work pressure: పని ఒత్తిడికి మరొకరు బలి.. బజాజ్ ఫైనాన్స్ ఉద్యోగి ఆత్మహత్య
ఇక, అభిజిత్ మోండల్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. రోజుల తరబడి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నా.. ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలను సేకరించలేదని పేర్కొన్నారు. సీబీఐ వద్ద డేటా ఉంటే మళ్లీ కస్టడీ ఎందుకు అని అడిగారు. అలాగే, సందీప్ ఘోష్ తరపు న్యాయవాది వాదిస్తూ.. నా క్లైంట్ ఆర్జీ కర్ ఆసుపత్రి ప్రిన్సిపాల్.. తాలా పోలీస్ స్టేషన్‌కి కాదు అన్నారు. సందీప్ ఘోష్ బెయిల్‌ను జాప్యం చేసేందుకే సీబీఐ కస్టడీని కోరుతుందని డిఫెన్స్ ఆందోళన వ్యక్తం చేసింది. సీబీఐ కస్టడీలో ఐదు రోజులు ఉన్నప్పటికీ.. వారు ఒక్కసారి కూడా నా క్లయింట్‌ను ప్రశ్నించలేదని సందీప్ ఘోష్ లాయర్ పేర్కొన్నారు. దీంతో సందీప్ ఘోష్, అభిజిత్ మండల్ కస్టడీని పొడిగించాలన్న సీబీఐ అభ్యర్థనను తిరస్కరించిన న్యాయస్థానం.. నిందితులిద్దరినీ మరో నాలుగు రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాలని ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!