Kolkata Doctor Case: కోల్‌కతా హత్యాచార కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసులు తప్పుడు ఆధారాలు సృష్టించారు..
- కోల్‌కాతా హత్యాచార కేసులో బిగ్ ట్విస్ట్..
- పోలీసులు తప్పుడు ఆధారాలు సృష్టించారని కోర్టుకు తెలిపిన సీబీఐ..
- ఈ నెల 30వ తేదీ వరకు అభిజిత్ మండల్- సందీప్ ఘోష్ కు కస్టడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata Doctor Case: ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ మహిళా డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో సీబీఐ సంచనల వ్యాఖ్యలు చేసింది. తాలా పోలీస్ స్టేషన్‌లో తప్పుడు రికార్డులు సృష్టించారని ఆరోపించింది. తాలా పీఎస్ ఇన్‌ఛార్జ్ అభిజిత్ మండల్, మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌లను కస్టడీలో విచారించిన సీబీఐ.. తమ దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చినట్లు స్పెషల్ కోర్టుకు తెలిపింది. తాలా పోలీస్ స్టేషన్‌లో కేసుకు సంబంధించి కొన్ని తప్పుడు రికార్డులు సృష్టించబడినట్లు గుర్తించామని పేర్కొనింది. సెప్టెంబరు 14న అభిజిత్ మండల్‌ను అరెస్టు చేయగా, కోర్టు ఆదేశాల మేరకు మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను సెప్టెంబర్ 15వ తేదీన అదుపులోకి తీసుకున్నట్లు సీబీఐ చెప్పుకొచ్చింది.
Read Also: Sri Lanka vs New Zealand: నేటి నుంచే రెండో టెస్ట్.. కీలక పేసర్ లేకుండానే శ్రీలంక..
Also Read
కాగా, మాజీ పోలీస్ అధికారి అభిజిత్ మండల్, సందీప్ ఘోష్ తరపు న్యాయవాదులు కోర్టులో అభియోగాలు మోపడానికి బదులుగా సాక్ష్యాలను సమర్పించాలని సీబీఐని కోరారు. అత్యాచారం, హత్య జరిగిన తర్వాత ఆసుపత్రి అధిపతి (ఘోష్) ఇన్‌ఛార్జ్ అధికారితో మాట్లాడటం సహజమని వారు అన్నారు. ఇక మాజీ పోలీస్ అధికారి తరపున న్యాయవాది అయాన్ భట్టాచార్య వాదిస్తూ.. ఇంతకీ సీబీఐ ఎవరిని విచారించింది.. ఈ కేసులో నా క్లైంట్ (మండల్) ప్రమేయం లేదని వాదించారు. అలాగే, సీల్డ్ కవర్‌ను కోర్టు పరిగణించరాదని సందీప్ ఘోష్ తరపు న్యాయవాది జోహైబ్ రవూఫ్ అన్నారు. ఇక, స్పెషల్ కోర్టులో సీల్డ్ కవర్ నివేదికను సీబీఐ అధికారులు సమర్పించారు. నిందితులిద్దరికీ సెప్టెంబర్ 30వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగించాలని కోరింది. ఇక, సీబీఐ వాదనలతో ఏకీభవించిన కోర్టు ఇద్దరికీ ఈ నెల 30వ తేదీ వరకు కస్టడీ విధించింది.
తాజావార్తలు
-
Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
-
LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్‌పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
-
CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
-
Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
-
Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!