RG Kar Medical Hospital: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం- హత్యపై కోల్‌కతాలోని సీల్దాలోని సెషన్స్ కోర్టు ఈరోజు (జనవరి 18) తన తీర్పును వెల్లడించనుంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. దీంతో వందలాది మంది ప్రజల నిరసనలు చేశారు. కోల్‌కతా పోలీస్‌లో పౌర వాలంటీర్‌గా పని చేస్తున్న సంజయ్ రాయ్.. గత ఏడాది ఆగస్టు 9వ తేదీన ప్రభుత్వ ఆసుపత్రి సెమినార్ హాల్‌లో వైద్యురాలిపై నేరానికి పాల్పడినట్లు అభియోగాలు మోపారు. దీనిపై సీల్దా కోర్టు న్యాయమూర్తి అనిర్బన్ దాస్ ముందు విచారణ ప్రారంభమైన 57 రోజుల తర్వాత తీర్పు వెలువడనుంది.
Read Also: Pixel Satellite : దేశంలోనే తొలి ప్రైవేట్ ఉపగ్రహం.. పిక్సెల్ ప్రయోగం.. ప్రధాని మోదీ ప్రశంసలు
అయితే, కోల్‌కతా పోలీసుల నుంచి ఈ కేసును స్వీకరించిన తర్వాత సీబీఐ ఆగస్టు 13న 120 మందికి పైగా సాక్షుల వాంగ్మూలాన్నీ నమోదు చేసుకుంది. 66-రోజుల పాటు విచారణలో సంజయ్ రాయ్ నేరానికి పాల్పడినట్లు తగిన DNA నమూనాలు, నేరం జరిగిన ప్రదేశంలో దొరికిన వెంట్రుకలతో కూడిన నివేదికను సమర్పించింది. ట్రైనీ డాక్టర్ ను అత్యాచారం చేసే సమయంలో నిందితుడి శరీరంపై ఐదు గాయాలు కనిపించాయని సీబీఐ తరపు లాయర్ వెల్లడించారు. అంతేకాకుండా, అతడు సెమినార్ హల్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించకుండా పోయిన అతని బ్లూటూత్, నేరం జరిగిన ప్రదేశంలో దొరికిందని సీబీఐ సీల్దా కోర్టులో చెప్పారు. ఇక, ఈరోజు సెషన్స్ కోర్టు ఈ కేసులో తుది తీర్పును ఇవ్వనుంది.