NTV Telugu Site icon

Cyclone Dana Effect: కోల్‌కతా, భువనేశ్వర్ ఎయిర్‌‌పోర్టులు మూసివేత.. ప్రయాణికులకు ఇక్కట్లు

Dana

Dana

దానా తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది. ఈ తుఫాన్ పెను బీభత్సమే సృష్టించనుందని ఇప్పటికే భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్, ఒడిశాలో దానా తుఫాన్ హడలెత్తించనుంది. ఐఎండీ హెచ్చరికలతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ఇదిలా ఉంటే కోల్‌కతా, భువనేశ్వర్ విమానాశ్రయాల్లో విమాన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. మరికొన్ని గంటల్లో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో విమాన సర్వీసులను నిలిపివేశారు. ఇప్పటికే 200లకు పైగా ట్రైన్ సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీపావళి పండుగకు సొంతూళ్లకు వెళ్లేందుకు రిజర్వేషన్లు చేసుకున్న వారంతా ఇక్కట్లు పడుతున్నారు. భువనేశ్వర్, కోల్‌కతా విమానాశ్రయాలు గురువారం సాయంత్రం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు విమాన సర్వీసులను నిలిపివేశారు.

ఇది కూడా చదవండి: Delhi: ప్రధాని మోడీతో ఒమర్ అబ్దు్ల్లా భేటీ.. జమ్మూకాశ్మీర్ రాష్ట్ర హోదాపై చర్చ

దానా తుఫాన్‌తో బెంగాల్, ఒడిశాపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇప్పటికే పలువురిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను రాష్ట్ర ప్రభుత్వాలు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాత్రిపూట నాబన్నాలో బస చేయనున్నారు.

అక్టోబర్ 24 అర్ధరాత్రి దానా తీరం దాటనుంది. ఇక అక్టోబర్ 25 ఉదయం తీవ్ర తుఫానుగా మారనుంది. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపం దగ్గర అతి సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. గాలుల వేగం గంటకు 100-110 కి.మీ నుంచి 120 కి.మీ వరకు ఉంటుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.