Karnataka Congress MLA : కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే సొంత పార్టీ నేతలపైనే వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఏకంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య టార్గెట్‌గా విమర్శలు చేశారు. ముఖ్యమంత్రిని ఎంపిక చేయడం వచ్చని.. అలాగే వారిని దించడం కూడా తనకు తెలుసంటూ ఘాటు విమర్శలు చేశారు. తనకు సీఎంను ఎంపిక చేయడం వచ్చు అని.. వారిని కిందకు దించడం కూడా తెలుసని కాంగ్రెస్ సీనియర్ నేత బీకే హరిప్రసాద్ అన్నారు. కర్ణాటక సిద్ధరామయ్య కేబినెట్‌లో ఆయనకు చోటు లభించక పోవడంతో పార్టీ కలా పాలకు దూరంగా ఉన్నారు. శుక్రవారం నగరంలో ఈడిగ, బిల్లవ, ధీవర సమాజానికి చెందిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న బీకే హరి ప్రసాద్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. సీఎం సిద్దరామయ్యను ఉద్దేశించి సీఎంను ఎలా దించాలో తెలుసన్నారు. కాంగ్రెస్‌లో ఐదుగురు ముఖ్య మంత్రులను ఎంపిక చేయడంలో కీలక భూమిక పోషించానని గుర్తు చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్దరామయ్య విషయంలోనూ అదే జరిగిందన్నారు.
Read also: Nedurumalli Ramkumar Reddy : జగన్ అమలు చేస్తున్న పథకాలు.. అభివృద్ధి పాలనే ప్రజా స్పందనకు నిదర్శనం
బీసీ వర్గాలకు న్యాయం జరు గుతుందనే సిద్దరామయ్య సీఎం అయ్యేందుకే సహకరించానని బీకే హరి ప్రసాద్ అన్నారు. వ్యక్తిగతంగా పదవులకోసం ఎవరివద్దా చేయిచాచేది లేదన్నారు. పార్టీ ఎన్నికల కమిటీ సభ్యుడిగా ఉన్న ఈడిగ కులానికి చెందిన వారిలో నలుగురికి టికెట్‌లు కేటాయించడంలో కొంత వెనుకడుగు అయ్యిందన్నారు. కులరాజకీయాలు ఎప్పుడూ చేయనని అయితే అన్యాయం జరిగినప్పుడు మాట్లాడక తప్పదన్నారు. కులస్థులంతా ఐకమత్యంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ముఖ్యమంత్రిని చేయడం, దించడం కూడా వచ్చునంటూ హరిప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై మంత్రి నాగేంద్ర తీవ్రంగా స్పందించారు. సిద్దరామయ్యను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించడం అంత సులువు కాదని, సీనియర్ నేత హరిప్రసాద్ ఇలా వ్యాఖ్యానించి ఉండరాదన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో ఇప్పటివరకు రెండున్నరేళ్ల తర్వాత మరో సీఎం వస్తారనే అంశమై తరచూ వ్యాఖ్యలు ఉన్నాయి. అయితే దించడం కూడా నాకు తెలుసనే హరిప్రసాద్ మాటలు పార్టీలో తీవ్ర చర్చకు కారణమయ్యాయి. ఇదే విషయమై బీకే హరిప్రసాద్ శనివారం బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ మంత్రిస్థానం తప్పినందుకు అసంతృప్తి ఉందని, రాజకీయాల్లో ఏదైనా జరగ వచ్చునన్నారు. ఏ విషయమైన ఆలోచన లేకుండా మాట్లాడనని, అక్కడ కెమెరా లేదని నా అభిప్రాయం తెలిపానన్నారు. ఎవరో మొబైల్‌లో రికార్డు చేశారన్నారు. అయినా నా వ్యాఖ్యలకు వెనుకడుగు వేసేది లేదని తేల్చి చెప్పారు. నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ చెప్పిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోలేదని, ప్రస్తుతం కూడా అదే పంథాలో కొనసాగుతానన్నారు. కాగా గృహ నిర్మాణశాఖ మంత్రి జమీర్ అహ్మద్ స్పందిస్తూ ముఖ్యమంత్రిని మార్చేశక్తి ఉందనే బీకే హరిప్రసాద్ వ్యాఖ్యలు సమం జసం కావన్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలు తగిన నిర్ణయం తీసుకుంటారని అన్నారు.