NTV Telugu Site icon

Telangana BJP: రాజధానికి రండి.. కిషన్‌ రెడ్డి, ఈటల, రాజగోపాల్‌కు హైకమాండ్ పిలుపు

Kisahnreddy, Etala, Rajagopal Reddy

Kisahnreddy, Etala, Rajagopal Reddy

Telangana BJP: తెలంగాణ బీజేపీలో పరిస్థితిని చక్కదిద్దేందుకు బీజేపీ నాయకత్వం రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆయన హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్రమంత్రి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ లో నేటి కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు పార్టీ హైకమాండ్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మాత్రం ఇప్పటికే ఢిల్లీకి బయలు దేరారు.

ఈటల రాజేందర్, రాజగోపాల్ రెడ్డిలతో పార్టీ హైకమాండ్ సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొననున్నారు. హైకమాండ్ పిలుపు మేరకు ఈటల, రాజగోపాల్ ఢిల్లీకి రావడంతో అక్కడ ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. కాగా.. రాష్ట్రంలో బీజేపీ తమను కలుపుకుని పోవడం లేదని, కార్యక్రమాలు అనుకున్న రీతిలో జరగడం లేదని ఈ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ వర్గం, ఈటల వర్గం మధ్యవర్తిత్వం కోసం కిషన్ రెడ్డిని అధిష్టానం పిలిచినట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు కిషన్ రెడ్డిని ఉపయోగించుకోవాలని హైకమాండ్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Read also: Telangana Rains: నేడు, రేపు భారీ వర్షాలు. 8 జిల్లాలకు వాతావరణ హెచ్చరిక

జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రేపు తెలంగాణకు రానున్నారు. ఈ క్రమంలోనే కాషాయ పార్టీ హైక మాండ్ పార్టీ వ్యవహారాలను సెట్ చేసే పనిలో పడింది. రేపు (ఆదివారం) ఉదయం పార్టీ నేతలతో నడ్డా సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రేపు తెలంగాణకు రానున్నారు. ఈ పర్యటన ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. పెద్దఎత్తున జన సమీకరణకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. నడ్డా మినిట్ టు మినిట్ ప్రతిపాదన షెడ్యూల్ ఖరారైంది. నాగర్‌కర్నూల్‌లో జరిగే బహిరంగ సభలో నడ్డా పాల్గొంటారు. రేపు మధ్యాహ్నం 12:45 గంటలకు నడ్డా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు.

సంపర్క్ సే అభియాన్‌లో భాగంగా మధ్యాహ్నం 1:15 నుండి 2:30 గంటల వరకు నడ్డా ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులతో సమావేశమవుతారు.నడ్డా మధ్యాహ్నం 3:00 గంటలకు నోవాటెల్ హోటల్‌కు చేరుకుంటారు. నడ్డా సాయంత్రం 4:00 గంటల వరకు నోవాటెల్ హోటల్‌లో ఉంటారు.సాయంత్రం 4:15 గంటలకు నడ్డా హెలికాప్టర్‌లో శంషాబాద్ విమానాశ్రయం నుంచి నాగర్ కర్నూల్ సభకు బయలుదేరి వెళతారు. సాయంత్రం 4:45 గంటలకు నాగర్ కర్నూల్ చేరుకుంటారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు నాగర్ కర్నూల్ జడ్పీహెచ్‌ఎస్ స్కూల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభకు నడ్డా హాజరుకానున్నారు. జాతీయ అధ్యక్షుడు నాగర్ కర్నూల్ నుంచి సాయంత్రం 6:10 గంటలకు బయలుదేరుతారు. నడ్డా సాయంత్రం 6:40 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు.
నడ్డా రాత్రి 7:40 గంటలకు విమానాశ్రయం నుంచి తిరువనంతపురం వెళ్లనున్నారు.
Kia Seltos facelift: కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ అన్‌ఆఫిషియల్ బుకింగ్స్ ప్రారంభం..