Kiren Rijiju: పరారీలో ఉన్న ఇస్లామిక్ బోధకుడు జకీర్ నాయక్ భారతీయ ముస్లింలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, వక్ఫ్ సవరణ బిల్లుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. వివాదాస్పద బోధకుడు వక్ఫ్ బిల్లు ‘‘చెడు పరిణామాలను’’ కలిగిస్తుందని, ముస్లింలు ఈ బిల్లుని తిరస్కరిస్తున్నట్లు బిల్లుని పరిశీలిస్తున్న ‘‘ జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)’’ సందేశాలు పంపాలని ఆయన పిలుపునిచ్చాడు. ఆన్‌లైన్ పిటిషన్‌కి క్యూఆర్ కోడ్, యూఆర్ఎల్‌ని షేర్ చేస్తూ, కనీసం 5 మిలియన్ల భారతీయ ముస్లింలు తమ తిరస్కరణలను సెప్టెంబర్ 13తోపు పంపాలని అన్నారు.
Read Also: IC814 hijack: హైజాక్ విమానంలో అత్యంత కీలకమైన వ్యక్తి.. గుర్తించని ఉగ్రవాదులు.. అతను ఎవరంటే..?
కేంద్రమంత్రి కిరణ్ రిజిజు జకీర్ నాయక్ ఆన్‌లైన్ పోస్ట్‌ని తప్పుదోవ పట్టించేవిగా, తప్పుడు ప్రచారమని పేర్కొన్నారు. ‘‘ దయచేసి మన దేశం వెలుపల ఉన్న అమాయక ముస్లింలను తప్పుదారి పట్టించొద్దు. భారతదేశ ప్రజాస్వామ్య దేశం, ప్రజలు వారి సొంత అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. తప్పుడు ప్రచారం తప్పుడు కథనాలకు దారి తీస్తుంది’’ అని కేంద్ర మంత్రి అన్నారు.
మనీలాండరింగ్, ద్వేషపూరిత ప్రసంగాల ఆరోపణలపై భారతదేశంలో వాంటెడ్ అయిన జకీర్ నాయక్ 2016లో దేశం విడిచి పారిపోయాడు. వక్ఫ్ సవరణ బిల్లు ద్వారా వక్ఫ్ బోర్డు అపరిమిత అధికారాలకు అడ్డుకట్ట వేయాలని కేంద్రం భావించింది. ఈ నేపథ్యంలోనే వక్ఫ్ సవరణ బిల్లుని తీసుకువచ్చింది. ఇందుల్లో ముస్లిమేతర, ఒక కేంద్ర మంత్రి, ముగ్గురు ఎంపీలు, సీనియర్ ఐఏఎస్ అధికారులు వక్ఫ్ బోర్డులో చేర్చడంతో పాటు మహిళలకు చోటు కల్పించారు. అయితే, ఈ బిల్లుని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. ఇది మత స్వేచ్ఛని, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుందని కాంగ్రెస్ ఆరోపించింది. వక్ఫ్ బోర్డు సవరణల ప్రకారం ప్రభుత్వం సూచించిన విధంగా వితంతువులు, విడాకులు తీసుకున్నవారు, అనాథల సంక్షేమం కోసం అందుకునే సొమ్మును వినియోగించాలి.