Site icon NTV Telugu

Arunachal Pradesh: వరదలు బీభత్సం.. ప్రమాదకర వీడియో విడుదల చేసిన కిరణ్ రిజిజు

Arunachal Pradesh

Arunachal Pradesh

ఈశాన్య రాష్ట్రాలు గత 48 గంటలుగా కుండపోత వర్షాలతో అతలాకుతలం అయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇప్పటి వరకు 30 మంది వరకు చనిపోయారు. ఇక లక్షలాది ఇళ్లు నీట మునిగాయి. అనేక మంది నిరాశ్రయులయ్యారు.

ఇది కూడా చదవండి: PM Modi: కెనడా “G-7 సమ్మిట్”కు ప్రధాని మోడీ వెళ్లడం లేదు.. రెండు దేశాల మధ్య సంబంధాలే కారణం.!

అయితే భారీ వర్షాలు కారణంగా అరుణాచల్‌ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడి ప్రాణాలు కోల్పోయారు. అయితే వరదలు ముంచెత్తడంతో ఆయా ప్రాంతాలు ప్రమాదకర పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అయితే ఒక వ్యక్తి ఉధృతంగా ప్రవహిస్తున్న నీటి ప్రవాహంలో వేలాడే వంతెనపై ప్రమాదకరంగా ప్రయాణించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను కేంద్రమంత్రి కిర్ రిజిజు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇలా ప్రమాదకర ప్రయాణాలు చేయొద్దని ప్రజలకు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. దయచేసి జాగ్రత్తగా, సురక్షితంగా ఉండండి. ప్రభుత్వం అవసరమైన సహాయాన్ని అందిస్తుందని కేంద్రమంత్రి రాసుకొచ్చారు. చైనా-మయన్మార్ సరిహద్దుల ట్రై-జంక్షన్ సమీపంలో అరుణాచల్ ప్రదేశ్‌లోని అంజా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: Mrunal Thakur: ఇంత పిసినారి హీరోయిన్‌ని ఎక్కడ చూసి ఉండరు..

ఈ వంతెన వెదురు, తాడు, చెక్క పలకలతో తయారు చేయబడినట్లు కనిపిస్తోంది, గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వీటిలో చాలా వరకు కొట్టుకుపోయాయి. ఇదొక్కటే ఉండడంతో ప్రమాదకరంగా ప్రయాణం చేశాడు. ఒకవేళ తెగిపోతే ప్రాణాలు పోయినట్లే.

ఇక వరదల కారణంగా చనిపోయిన కుటుంబాలకు ముఖ్యమంత్రి పెమా ఖండు సంతాపం వ్యక్తం చేశారు. బాధిత ప్రజలకు అవసరమైన సహాయం అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కొనసాగుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలని ఖండు కోరారు. ప్రస్తుతానికి నదులు మరియు నీటి వనరులలోకి దిగవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సంబంధిత అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు.

 

Exit mobile version