Kiren Rijiju: బిల్లు వీగిపోవడంపై సంబరాలు దురదృష్టకరం.. కాంగ్రెస్‌పై కిరణ్ రిజిజు ధ్వజం
- బిల్లు వీగిపోవడంపై సంబరాలు దురదృష్టకరం
- మహిళల వ్యతిరేక పార్టీగా ముద్ర పడింది
- కాంగ్రెస్‌పై కిరణ్ రిజిజు ధ్వజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోని మహిళలకు కాంగ్రెస్ హాని కలిగించిందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. కేంద్ర కేబినెట్ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడారు. మహిళలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పని చేసిందని ఆరోపించారు. కచ్చితంగా కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు మహిళల ఆగ్రహాన్ని ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ మహిళల వ్యతిరేక పార్టీ అని ముద్ర పడిందని.. ఈ కళంకం ఎప్పటికీ తొలగిపోదని పేర్కొన్నారు.
ప్రతిపక్షాలన్నీ కుట్ర పన్ని మహిళా బిల్లును అడ్డుకున్నాయని ధ్వజమెత్తారు. మహిళల హక్కులను నిరాకరించే మనస్తత్వంతో కాంగ్రెస్, ప్రతిపక్షాలు ఉండడంపై విచారం వ్యక్తం చేశారు. పైగా మహిళలకు హక్కులు కల్పించకుండా వేడుకలు జరుపుకోవడం ఘోరమైన పాపంగా అభివర్ణించారు. మహిళలకు హక్కులు ఇవ్వకుండా తమను తాము విజేతలుగా భావించుకునే పార్టీని ప్రపంచంలో ఎప్పుడైనా చూశారా? అని ప్రశ్నించారు. మహిళలకు రిజర్వేషన్ కల్పించడం అనేది మనందరి బాధ్యత అని పేర్కొ్న్నారు.
Also Read
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Rahul Gandhi: రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానానికి గో-అరౌండ్.. రెండో ప్రయత్నంలో సేఫ్ ల్యాండింగ్!
- Supreme Court: టెట్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఇకపై ఆ అర్హతలు తప్పనిసరి!
ఈనెల 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను కేంద్రం ఏర్పాటు చేసింది. మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు నారీశక్తి వందన్ చట్టసవరణ, డీలిమిటేషన్ బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టింది. దాదాపు 22 గంటల పాటు చర్చ చేపట్టిన తర్వాత ఓటింగ్ నిర్వహించింది. అనుకూలంగా 298 మంది, వ్యతిరేకంగా 230 మంది ఓట్లు వేశారు. మూడింట రెండొంతుల మెజార్టీ లేకపోవడంతో బిల్లులు వీగిపోయినట్లుగా స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. దీంతో బిల్లులు వెనక్కి తీసుకుంటున్నట్లుగా కేంద్రం తెలిపింది.
#WATCH | Delhi: Parliamentary Affairs Minister Kiren Rijiju says, "The Budget Session has been concluded officially. It was a very productive Budget Session… The Union Budget was passed very successfully. Then, in the second session, the Prime Minister gave a statement on the… pic.twitter.com/ypsr4QN3Rp
— ANI (@ANI) April 18, 2026
తాజావార్తలు
-
Telangana Language Day : కాళోజీ జయంతి.. తెలంగాణ మాటకు పండుగ రోజు.!
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!