Site icon NTV Telugu

Kim Kardashian: “అంబానీలు” ఎవరో తెలియకున్నా పెళ్లికి వచ్చాం.. కిమ్ కర్దాషియాన్ కామెంట్స్..

Kim Kardashian

Kim Kardashian

Kim Kardashian: గతేడాది రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ అట్టహాసంగా జరిగింది. ఈ వివాహానికి దేశ విదేశాల నుంచి సెలబ్రిటీలు హాజరయ్యారు. అనంత్, రాధికల వివాహానికి హాజరయ్యేందుకు కిమ్ కర్దాషియాన్, ఖ్లో కర్దాషియాన్ హాజరయ్యారు. భారతీయ సంప్రదాయ వస్త్రాలలో వీరిద్దరు మెరిసిపోయారు.

ఇదిలా ఉంటే, రియాలిటీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియాన్ తన తాజా ఎపిసోడ్‌లో కీలక విషయాన్ని గురించి వెల్లడించారు. తనకు ‘‘అంబానీ’’ కుటుంబం గురించి తెలియదని చెప్పారు. పెళ్లికి దాదాపుగా 18-22 కిలోల బరువు ఉన్న ఆహ్వానాన్ని అందుకుని ఆశ్చర్యపోయినట్లు కిమ్, ఖ్లో వెల్లడించారు. ‘‘ది కర్దాషియన్స్’’ కొత్త ఎపిసోడ్‌లో ‘‘నిజానికి నాకు అంబానీలు తెలియదు. మాకు కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు’’ అని కిమ్ చెప్పారు. వీరిద్దరు లాస్ ఎంజెల్స్ నుంచి ముంబైకి 48 గంటల సుదీర్ఘ పర్యటన గురించి వివరించారు.

Read Also: Taliban: రైలు హైజాక్‌తో మాకు సంబంధం లేదు.. పాక్ ఆరోపణలపై తాలిబన్లు..

భారతదేశంలో అత్యంత సంపన్న కుటుంబానికి ఆభరణాలు డిజైన్ చేసే లోరైన్ స్కార్ట్జ్ కారణంగానే తాము భారత్ వచ్చినట్లు చెప్పారు. ‘‘లోరైన్ స్క్వార్ట్జ్ మాకు ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్‌లో ఒకరు. ఆమె నగల వ్యాపారి. ఆమె అంబానీ కుటుంబానికి నగలు డిజైన్ చేస్తుంది. ఆమె వాళ్ల పెళ్లికి వెళ్తున్నానని చెప్పింది. వాళ్లు నిన్ను ఆహ్వానించడానికి ఇష్టపడుతున్నారని చెబితే, తప్పకుండా వస్తామని చెప్పాము’’ అని కిమ్ చెప్పారు.

‘‘మాకు ఇన్విటేషన్ వచ్చింది. అది 18-22 కిలోలు ఉంది. దాని నుంచి మ్యూజిక్ వచ్చింది. అది క్రేజీగా ఉంది. ఇలాంటి ఆహ్వానం చూసినప్పుడు, మీరు ఇలాంటి వాటికి నో చెప్పకూడదని అనుకుంటారు’’ అని ఖ్లో చెప్పింది. ఖ్లో , కిమ్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన అద్భుతమైన ఫ్యూజన్ లెహంగాలను ధరించి, అంబానీల పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.

Exit mobile version