NTV Telugu Site icon

Stampede at Khatu Shyam Temple: గుడిలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి

Stampede At Khatu Shyam Temple

Stampede At Khatu Shyam Temple

రాజస్థాన్ సికర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఖతు శ్యామ్ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు మరణించారు. మాసోత్సవాలు సందర్భంగా ఈ ఉదయం స్వామివారికి తొలిపూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఆలయ తలుపులు తెరవగా.. భక్తులు ఒక్కసారిగా గుడిలోకి దూసుకువచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఘటనలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మరణించగా.. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని జైపుర్‌ లోని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలు పై సీసీటీవీ ఫుటేజ్‌ ద్వారా వివరాలు సేకరిస్తున్నారు. మృతుల్లో హిసార్‌కు చెందిన ఓ మహిళగా పోలీసులు గుర్తించారు.

అయితే ఈ సంఘటనపై స్పందించిన మోడీ విచారం వ్యక్తం చేసారు. ఖాతు శ్యామ్‌ ఆలయంలో జరిగిన తొక్కిసలాట కారణంగా భక్తులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అని అన్నారు. గాయపడిన భక్తులను త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అంటూ ప్రధాని మోడీ ట్వీట్‌ చేసారు. సికార్‌లోని ఖతు శ్యామ్‌జీ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో భక్తులు మృతి చెందడం పట్ల రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సంతాపం తెలిపారు. ముగ్గురు మహిళల మరణం దురదృష్టకరం మని తెలిపారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన భక్తులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను” అని ట్వీట్‌ చేసారు.

Show comments