Khalistan: ఖలిస్తాన్ లేదా ప్రత్యేక సిక్కు దేశం గురించి ప్రస్తావించబడిన పాఠ్యాంశాన్ని CBSE 12వ తరగతి విద్యార్థుల పొలిటికల్ సైన్స్ సిలబస్ నుంచి తొలగించారు. ఈ పాఠ్యాంశంపై సిక్కుల అత్యున్నత సంస్థ ‘‘శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ (SGPC)’’ వ్యతిరేక వ్యక్తం అయింది. సిక్కు సమాజాన్ని వ్యతిరేకంగా ఈ పాఠ్యాశం ఉందని పలు లేఖలు రావడంతో పాఠశాల విద్యపై అత్యున్నత సలహా సంఘం NCERT ఈ సిలబస్ ని తొలగిస్తున్నట్లు తెలిపింది. దీనిపై వచ్చిన ఫిర్యాదులపై నిపుణుల కమిటీ వేశామని, కమిటీ ఇచ్చిన సిఫారసుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్‌సీఈఆర్‌టీ తెలిపింది.
Read Also: Shocking : పడకగదిలో ప్రియుడితో తల్లికి అడ్డంగా బుక్కయిన కూతురు.. ఆ తర్వాత ఏమైందంటే
పంజాబ్ కు సంబంధించిన పాఠ్యాంశంలో సిక్కుల ప్రత్యేక దేశం కోసం అభ్యర్థన అనే వ్యాఖ్యాలను తొలగించారు. నాలుగో పేరా నుంచి ఖలిస్తాన్ అనే అంశాన్ని తొలగించారు. మార్పులతో కూడిన 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పాఠ్యపుస్తకాల సాఫ్ట్ కాపీని NCERT వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు.
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(NCERT) తన పుస్తకం ‘పాలిటిక్స్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్’ అధ్యాయం-8లోని రీజనల్ ఆస్పిరేషన్స్‌లో ఆనంద్‌పూర్ సాహిబ్ తీర్మానం గురించి తప్పుదారి పట్టించే సమాచారాన్ని నమోదు చేసిందని SGPC చీఫ్ హర్జిందర్ సింగ్ ధామీ గత నెలలో తెలిపారు. సిక్కుల మనోభావాలు దెబ్బతీసేవిగా ఉన్నాయని ఆయన అన్నారు. 1973 తీర్మానం రాష్ట్ర హక్కులు, సమాఖ్య నిర్మాణాన్ని బలోపేతం చేయడం గురించి చర్చిందని అన్నారు. సిక్కులను వేర్పాటువాదులుగా చిత్రీకరించడం ఏ మాత్రం సమర్థనీయం కాదని ఆయన అన్నారు. సిలబస్ లో ఉన్న అభ్యంతరకరమైన అంశాలను తొలగించాలని ధామీ అన్నారు. ఆనంద్‌పూర్ సాహిబ్ తీర్మానం ఎలాంటి తప్పులు లేని చారిత్రక పత్రమని అన్నారు.