Site icon NTV Telugu

Hathras case: హత్రాస్ అత్యాచారం కేసులో కీలక తీర్పు.. ఒకరికి జీవిత ఖైదు..

Hathras Case

Hathras Case

Hathras case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఉత్తర్ ప్రదేశ్ లోని హత్రాస్ అత్యాచార ఘటన. దేశ రాజకీయాలన్నీ ఈ ఘటన చుట్టూనే తిరిగాయి. ఇదిలా ఉంటే ఈ కేసు ఎస్సీ/ఎస్టీ కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. 2020లో జరిగిన ఈ ఘటనలో నలుగురు నిందితుల్లో ఒకరికి జీవిత ఖైదు విధించగా.. మరో ముగ్గురిని నిర్దోషులుగా గురువారం కోర్టు ప్రకటించింది.

Read Also: MK Stalin: బీజేపీని ఓడించడం, మోదీ ప్రధాని కాకుండా చూడటమే మా లక్ష్యం..

2020 సెప్టెంబర్ లో 19 ఏళ్ల దళిత మహిళపై అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ ఘటన హత్రాస్ జిల్లాలోని బూల్‌గర్హిలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో అగ్రవర్ణాలకు చెందిన సందీప్ (20), రవి (35), లవ్ కుష్ (23), రాము (26) నిందితులుగా ఉన్నారు. వీరంతా బాధిత యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారనే అభియోగాలు ఎదుర్కొన్నారు. ఈ కేసులో కోర్టు 167 పేజీల తీర్పును వెలువరించింది. నలుగురు నిందితుల్లో సందీప్ మాత్రమే దోషి అని, మిగతా ముగ్గురు నిర్దోషులు అని కోర్టు తేల్చింది. సందీప్ కు జీవిత ఖైదు విధించింది.

అత్యాచార ఘటనలో తీవ్ర గాయాలపాలైన బాధిత యువతి ఢిల్లీలోని సప్దర్ జంగ్ ఆస్పత్రిలో 15 రోజులు చికిత్స తీసుకున్న తర్వాత మరణించింది. ఈ ఘటనలో పోలీసుల వ్యవహార శైలిని కూడా విమర్శించారు. యువతి కుటుంబ సభ్యులను ఇంట్లో నిర్భంధించి, ఆమె అంత్యక్రియలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారడంతో ఈ కేసును యోగీ ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది.

Exit mobile version