దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడు యావత్తు భారతదేశాన్ని కలవరపాటుకు గురి చేసింది. పహల్గామ్ ఉగ్ర దాడి నుంచి తేరుకుంటున్న సమయంలో మరోసారి ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరగడం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 12 మంది చనిపోగా.. పలువురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇది కూడా చదవండి: Mumbai: ముంబై ఎయిర్‌పోర్టులో భారీగా గంజాయి పట్టివేత.. ఆరుగురు స్మగ్లర్లు అరెస్ట్
ఇదిలా ఉంటే ఢిల్లీ బాంబ్ పేలుడుపై దర్యాప్తు సంస్థలు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. కారులో ఐఈడీ తరలిస్తుండగా ప్రమాదవశాత్తు ఈ పేలుడు సంభవించినట్లుగా దర్యాప్తు అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. సోమవారం ఉదయం హర్యానాలోని ఫరీదాబాద్‌లో బాంబ్ తయారీలో ఉపయోగించే 2,900 కిలోల రసాయనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో అనుమానితుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఈ క్రమంలో వారు వేరే ప్రాంతాలకు వెళ్లిపోబోతుండగా ఈ దుర్ఘటన జరిగినట్లుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎర్రకోట సమీపంలో అనుమానితులు తీవ్ర భయాందోళనకు గురైనట్లుగా భావిస్తున్నారు. ఆ సమయంలో పొరపాటుగా ఈ పేలుడు సంభవించి ఉంటుందని నిఘా వర్గాలు తెలుపుతున్నాయి.
ఇది కూడా చదవండి: Nagarjuna: నాగార్జునపై వ్యాఖ్యలకి చింతిస్తున్నా.. మంత్రి కొండా సురేఖ ట్వీట్
కారులో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED)ను అనుమానితుడు సరైన రీతిలో అమర్చకపోవడం వల్లే ఈ పేలుడు సంభవించినట్లుగా నిపుణులు అంచనాకు వచ్చారు. అయితే పేలుడు ధాటికి సమీపంలో ఉన్నవారికి తీవ్ర నష్టం జరిగిందని తెలుస్తోంది. ఇప్పటికే 12 మంది చనిపోగా.. పలువురు తీవ్రగాయాల పాలయ్యారు.
ఇక కారు నడిపిన కీలక నిందితుడు జమ్మూకాశ్మీర్‌కు చెందిన వైద్యుడు ఉమర్ నబీగా గుర్తించారు. సోమవారం పేలుడు సంభవించడానికి ముూడు రోజుల నుంచి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో కూడా ఎలాంటి కమ్యూనికేషన్లు జరిగించలేదు. ఈ మేరకు దర్యాప్తు సంస్థలు కీలక ఆధారాలు సేకరించారు. ప్రస్తుతం ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది.
