Siya Goyal: కేతన్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. 4 నెలల ముందే సియా-చేతన్ వివాహం!
- కేతన్ హత్య కేసులో సంచలన ట్విస్ట్
- నిశ్చితార్థం ముందే చేతన్‌తో సియా రహస్య వివాహం!
- పెళ్లి దండలతో ఉన్న ఫొటోలు వైరల్‌తో వెలుగులోకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పూణె యువ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసు ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. తాజాగా కళ్లు బైర్లు కమ్మే సంచలన ట్విస్ట్ వెలుగు చూసింది. పోలీసుల దర్యాప్తులో బిగ్ బ్రేకింగ్ వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరిలో కేతన్ అగర్వాల్‌తో సియా గోయల్‌కు నిశ్చితార్థం జరగకముందే.. చేతన్ చౌదరిని సియా గోయల్ రహస్యంగా వివాహం చేసుకున్నట్లుగా వెలుగులోకి వచ్చింది. చేతన్ చౌదరి-సియా గోయల్‌కు చెందిన పెళ్లి దండలతో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఓ ప్రైవేటు ఇన్స్టాగ్రామ్ నుంచి తొలగించిన ఫొటోలను రికవరీ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సాంకేతిక బృందాలు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.

Also Read
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
మరోవైపు పూణె గ్రామీణ పోలీసులు రంగంలోకి దిగి స్థానిక రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. కళాశాలకు చెందిన ఇద్దరు స్నేహితులు సాక్షులు సంతకాలు చేసినట్లుగా గుర్తించారు. ప్రస్తుతం స్నేహితులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. అయితే రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏ విధంగా పెళ్లి చేసుకున్నారన్న దానిపై కూపీ లాగుతున్నారు. ప్రత్యేక వివాహ చట్టం కింద వివాహ ధృవీకరణ పత్రం ఉందో లేదో కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.
అయితే డెస్టినేషన్ వెడ్డింగ్ (ఉధయ్‌పూర్ పెళ్లి) కోసం సియా గోయల్‌కు సంబంధించిన పలు పత్రాలను కేతన్ అగర్వాల్ కుటుంబ సభ్యులు అడిగారు. అయితే తన ఆధార్ కార్డు.. వగేరా పత్రాలు ఇస్తే.. రహస్య పెళ్లి వివరాలు బయట పడతాయేమోనన్న భయాందోళనతో చేతన్-సియా వేగంగా మర్డర్ స్కెచ్ అమలు చేయాలని భావించినట్లుగా పోలీసులు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఇందులో భాగంగానే జూన్ 14న కేతన్‌ను లోయలోకి తోసేశారు. కానీ అదృష్టం బాగుండి కేతన్ ప్రాణాలతో బయటపడ్డాడు. తిరిగి నాలుగు రోజుల తర్వాత జూన్ 18 పక్కాగా ప్లాన్ అమలు చేసి కేతన్ అగర్వాల్‌ను లోయలోకి తోసేసి చంపేశారు.
ఇలా వెలుగులోకి..
చేతన్‌కు సియా గోయల్‌కు పెళ్లి జరిగినట్లుగా మొబైల్ ఫోన్లలో లభించిన వాట్సాప్ చాట్ల ద్వారా బయటపడినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. కుటుంబ సభ్యులకు తెలియకుండా సియా గోయల్, చేతన్ చౌదరి సుమారు నాలుగు నెలల క్రితమే రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఇరు కుటుంబాలు వ్యతిరేకించే అవకాశం ఉండటంతో గోప్యంగా ఉంచినట్లు వాట్సాప్ సంభాషణల్లో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా గత ఆరు నుంచి ఏడు నెలల కాలానికి సంబంధించిన నిందితుల కాల్ రికార్డులు, లొకేషన్ డేటా, వాట్సాప్ చాట్లు, ఇంటర్నెట్ సెర్చ్ హిస్టరీని పోలీసులు విశ్లేషించారు. ఈ డిజిటల్ ఆధారాలు కేసు దర్యాప్తులో కీలకమైన సమాచారాన్ని అందించాయని అధికారులు చెబుతున్నారు. రహస్య వివాహం అనంతరమే కేతన్ హత్యకు కుట్ర పన్నినట్లు భావిస్తున్నారు. అలాగే కేతన్‌ను హత్య చేయడానికి జూన్ 14న తొలి ప్రయత్నం జరిగినట్లు కూడా దర్యాప్తులో వెల్లడైంది. ఆ రోజు హత్యకు ప్రయత్నించినప్పటికీ.. చివరి క్షణంలో సియా ధైర్యం కోల్పోవడంతో ఆ ప్రయత్నం విఫలమైందని పోలీసులు పేర్కొన్నారు. అనంతరం సియా చేతన్‌కు పంపిన సందేశంలో ‘‘నేను ఒంటరిగా ఈ పని చేయలేను.. నువ్వు కూడా రావాలి.. ఇద్దరం కలిసి కేతన్‌ను కొండపై నుంచి తోసేద్దాం.’’ అని పేర్కొన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!